నష్టాల్లో కూరుకుపోయిన అశ్వినీ దత్ ను కాపాడిన చిన్న సినిమా..!

Divya
సినీ ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ బ్యానర్ ను ఏర్పాటు చేసి, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాతగా అశ్వినీదత్ ఒక గుర్తింపు పొందాడు.. అశ్వినిదత్ సినిమాలు అనగానే కొత్తదనానికి నాంది అని చెప్పవచ్చు. అంతే కాదు ఈయన ఏదైనా సినిమా తీస్తున్నాడు అంటే అందులో ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రేక్షకులకు చెబుతున్నాడు అనే విషయం అందరికీ అర్థమైపోతుంది. స్టార్ హీరోలైన నందమూరి తారక రామారావు, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు.

అయితే అశ్వమేధం, సరిగమలు, గోవిందా గోవిందా సినిమాలతో ఏకంగా 30  కోట్ల రూపాయలను నష్టపోయిన అశ్వినీ దత్ కు.. ఎలాగైనా చిరంజీవి తో సినిమా తీయాలి అనే ఆలోచన వచ్చింది.. అయితే చిరంజీవి వేరే సినిమా ప్రాజెక్టు తో బిజీగా ఉండడంతో ఆ లోపు ఒక చిన్న సినిమా తీయాలని అనుకున్నాడు..అలా  అశ్వినీదత్ కు  వచ్చిన సినిమానే శుభలగ్నం. మొదటిసారిగా కోటి రూపాయలకు భర్తను అమ్మేసిన భార్య అనే సరికొత్త కాన్సెప్ట్ తో తెలుగులో సంచలనం సృష్టించారు.. ఇప్పటికీ భర్తలు తమ భార్యలతో కలిసి ఈ సినిమా చూడడానికి ఇబ్బంది పడతారు అంటే అది అతిశయోక్తి కాదు..

ఈ సినిమా  విడుదలైనప్పుడు ఏకంగా మహిళలతో సినిమా హాల్స్ అన్నీ నిండిపోయాయి.. ఇక ఏకంగా పెద్ద సినిమాలతో నష్టపోయిన అశ్వినీ దత్ కు కలెక్షన్ల సునామి కురిపించి, మంచి విజయాన్ని అందించింది శుభలగ్నం సినిమా. ఈ సినిమాలో జగపతి బాబు హీరోగా ఆమని భర్తను అమ్మేసే భార్యగా, రోజా కోటి రూపాయలకు భర్తను కొనుక్కునే భార్యగా ఈ చిత్రం అన్ని వర్గాల వారిని చాలా బాగా ఆకట్టుకుంది. 1994వ సంవత్సరంలో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూడా ఇప్పటికీ చెప్పే మాట ఏమిటంటే నష్టాల్లో కూరుకు పోయినప్పుడు ఆదుకున్న చిన్న సినిమా శుభలగ్నం అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: