ఆ స్టార్ హీరో సినిమా తీసి కోట్లు పోగొట్టుకున్న అశ్వినీదత్..!

Divya
అశ్వినీదత్ ప్రముఖ నిర్మాతగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ముఖ్యంగా చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేసి, మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపుగా ఈయన ఎంచుకునే సినిమా కథలన్నీ , ఒక సెన్సేషన్ హిట్ ను క్రియేట్ చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒక స్టార్ హీరో తో ఒక సినిమా తీసి ఏకంగా కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు అశ్వినీదత్.. ఆ సినిమా ఏంటి..? ఆ విశేషాలు ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..

అశ్వినీ దత్.. సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్న ఎన్టీఆర్ గెటప్ నే మార్చేసిన నిర్మాత అని చెప్పవచ్చు.. ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానంతోనే ఎన్టీఆర్ గెటప్ మార్చేసి, సరికొత్తగా చూపించి  ప్రేక్షకులను అబ్బురపరిచాడు.. జగదేకవీరుడు సినిమాతో కోట్లు కొల్లగొట్టిన అశ్వినీదత్, ఆ తర్వాత అశ్వమేధం, సరిగమలు ,గోవింద గోవింద లాంటి సినిమాలతో దాదాపుగా రూ.30 కోట్ల వరకు భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.

వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న అశ్వినీదత్ శుభలగ్నం సినిమా తో మళ్లీ ఊపందుకున్నాడు.. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమా శక్తి. శుభలగ్నం సినిమా తో అప్పటివరకు వెనుతిరిగి చూడకుండా సక్సెస్ తో దూసుకెళ్తున్న అశ్వినీదత్ , శక్తి సినిమాతో ఒక్కసారిగా బోల్తా కొట్టాడు అని చెప్పవచ్చు. ఆయన భార్య అలాగే అతని స్నేహితుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చెప్పినప్పటికీ ,సినిమాను ఆపుకోలేక, 2011 వ సంవత్సరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం శక్తి..

ఈ సినిమాతో అశ్వినీదత్ ఏకంగా 25 కోట్ల రూపాయలను కోల్పోవాల్సి వచ్చింది. కనీసం ప్రింటింగ్ కి అయిన ఖర్చు కూడా తనకు తిరిగి రాలేదు అని తీవ్రంగా బాధ పడ్డాడు.. తన కెరీర్లో ఇదే అతి పెద్ద డిజాస్టర్ అని అశ్వినీదత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అంతేకాదు మొదటి సారి శక్తి సినిమాకు నిర్మాతగా వ్యవహరించి తప్పు చేశాను అంటూ ఆయన బాధ పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: