మన హీరోల మజిల్ పవర్ తెలుసా..?

NAGARJUNA NAKKA
కథతో పాటు కండబలం నమ్ముకుంటున్నారు టాలీవుడ్ హీరోలు. బాలీవుడ్ ను టార్గెట్ చేస్తూ జిమ్ముల్లో చెమటలు చిందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ప్రతీ టర్నింగ్‌ పాయింట్‌లో రాజమౌళి కనిపిస్తాడు. 'ట్రిపుల్‌ ఆర్'తో పాన్‌ ఇండియన్‌ లెవల్‌కి తీసుకెళ్తున్నాడు. ఇక ఈ మూవీ కోసం తారక్‌ కంప్లీట్‌గా మేకోవర్ అయ్యాడు. ఫారెన్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ కోచింగ్‌లో బాడీ బిల్డర్‌లా మారాడు.
ఫిట్‌నెస్‌కి హై ప్రియారిటీ ఇచ్చే హీరోల్లో ముందుంటాడు రామ్ చరణ్. ఎక్కడికెళ్లినా వర్కవుట్స్‌ని విడిచిపెట్టని ఈ హీరో 'ధృవ'లో సిక్స్‌ప్యాక్‌తో కనిపించి ఫ్యాన్స్‌కి ఫిట్‌నెస్‌ గోల్‌ సెట్ చేశాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న 'ట్రిపుల్‌ ఆర్' కోసం చరణ్ మరింత ఫిట్‌గా తయారయ్యాడు. టీజర్‌తోనే జనాల్లో అంచనాలు పెంచేశాడు. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాతో బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాక్సింగ్‌ చాంపియన్‌లా నటిస్తున్నాడు విజయ్. రియల్‌ బాక్సర్‌లా కనిపించడానికి జిమ్‌లో గంటలకొద్ది కష్టపడుతున్నాడు.
పాన్ ఇండియన్ మూవీస్‌ అనగానే సౌత్ స్టార్స్‌ అంతా ఫైటింగుల్లోకి దిగిపోతున్నారు. మేకర్స్‌ కూడా యాక్షన్ ఎపిసోడ్స్‌కి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారని ఈ బ్యాక్‌డ్రాప్‌కే ఫిక్స్ అవుతున్నారు. హాలీవుడ్ స్టైల్‌లో సినిమాలు తీస్తున్నారు. ఇక ఈ స్టాండర్డ్స్‌ని రీచ్ కావడానికి తెలుగు హీరోలు కూడా హాలీవుడ్‌ స్టార్స్‌లా కండలు పెంచుతున్నారు. రామ్‌ కెరీర్‌లోనే లింగుసామి సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ్ బైలింగ్వల్‌గా రూపొందుతోన్న ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయ్యే అవకాశముంది. ఇక ఈ ఫస్ట్‌ మల్టీలింగ్వల్‌లో యూనిక్‌గా కనిపించడానికి కండలు పెంచుతున్నాడు రామ్. వరుణ్ తేజ్ ఇప్పటివరకు రెగ్యులర్ లుక్‌లోనే కనిపించాడు. మాస్ రోల్స్‌ చేసినా మజిల్డ్‌ బాడీపై పెద్దగా ఫోకస్ చేయలేదు.
'బాహుబలి' తర్వాత పాన్‌ ఇండియన్ మూవీస్‌ పెరిగినట్లే, హీరోలు కండలు పెంచడం కూడా ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ కోసం ప్రభాస్‌, రానా ఇద్దరూ బాడీ బిల్డ్‌ చేశారు. ముఖ్యంగా ప్రభాస్‌ సిక్స్‌ప్యాక్‌ కటౌట్‌తోనే నార్త్‌ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు. 'బాహుబలి'గా ముంబాయి మార్కెట్‌లోనూ హల్‌చల్‌ చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: