డబుల్ డోస్ : నాని యాక్టింగ్ హిట్.. కానీ సినిమా ఫస్ట్?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ అటు డబుల్ డోస్ సినిమాలకు మాత్రం కాస్త ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎంతో మంది హీరోలు  సినిమాల్లో డబుల్ రోల్ చేయడానికి కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు.. కానీ కొంతమంది హీరోలు కాస్త రిస్క్ అయినా డబుల్ రోల్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా డబ్బులు రోల్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.  ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన తెలుగు ప్రేక్షకుల నాచురల్ స్టార్ గా మారిపోయిన నాని కూడా కృష్ణార్జున యుద్ధం అనే సినిమాతో డబుల్ రోల్ ప్రయత్నించాడు.

 ఇక మొదటి సారి నాని తన కెరియర్ లో డబుల్ రోల్ చేస్తూ ఉండడంతో కృష్ణార్జున యుద్ధం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  అంతేకాదు ఇక ఈ సినిమాలో ఒక పాత్ర పల్లెటూరి నేటివిటీని చూపించే విధంగా ఉండటంతో ప్రేక్షకులు అందరూ ఈ సినిమా గురించి మరింత ఆత్రంగా ఎదురు చూసారు. సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అటు సినిమా లైన్..  ప్రేక్షకులకు  నచ్చకపోవడంతో తేడా కొట్టేసింది. దీంతో నాని చేసిన ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది.  నాని కెరీర్లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా ప్లాప్ గానే మిగిలిపోయింది.

 అయితే నటన పరంగా నానికి ఎక్కడ పేరు పెట్టాల్సిన అవసరం లేదు.  నాచురల్ నటనతో నాచురల్ స్టార్ గా మారిపోయిన నానీ  కృష్ణార్జున యుద్ధం సినిమా లో కూడా రెండు పాత్రల్లో కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు.  ముఖ్యంగా విలేజ్ నేటివిటీ లో ఉండే కృష్ణ పాత్రలో అయితే అదిరిపోయే స్లాంగ్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు అని చెప్పాలి.  మరోవైపు రాక్ స్టార్   అర్జున్ పాత్రలో కూడా నాని నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  ఇలా నటన పరంగా హిట్ కొట్టినప్పటికీ..  చివరికి సినిమా మొత్తం ఫ్లాప్ గానే మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: