డ్యుయల్ పాత్రలో వచ్చి మెప్పించిన బాలయ్య సినిమాలు..!

Divya
సింహం సింగిల్ గా వస్తుంది.. అనే డైలాగ్ రజనీకాంత్ సెట్ అయితే అదే సింహం డబుల్ గా వస్తే అది బాలకృష్ణ సినిమా లా ఉంటుంది అంటారు ఆయన అభిమానులు..అలా  బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించిన సినిమాలేంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
1. అపూర్వ సహోదరులు:
కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిసారిగా బాలకృష్ణ డ్యుయల్ పాత్రలో నటించాడు. అందులో విజయశాంతి , భానుప్రియ లు హీరోయిన్లుగా నటించారు. రాజ కుటుంబానికి చెందిన ఇద్దరు కవలలు విడిపోయి , పెద్దయిన తర్వాత వారి కుటుంబానికి అలాంటి గతిని పట్టించిన రౌడీలకు ముప్పు తిప్పలు పెట్టే యాక్షన్ సీన్లు ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. 1986లో విడుదలైన ఈ చిత్రం అత్యంత విజయాన్ని అందుకుంది.
2. రాముడు - భీముడు:
1988 కే మురళి మోహన్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ  డ్యూయల్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.  అంతే కాదు ఇందులో సుహాషిని , రాధాలు హీరోయిన్లుగా నటించారు.
3. బ్రహ్మర్షి - విశ్వామిత్ర:
ఈ సినిమా 1991 తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ పాత్రలో నటించాడు.
4. ఆదిత్య 369:
1991 లో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో,  బాలకృష్ణ డ్యుయల్ పాత్ర పోషించాడు. మోహిని హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ద్వారా బాలకృష్ణ లో ఉన్న నటనా ప్రతిభను వెలికి తీశారు దర్శకుడు.
5. మాతో పెట్టుకోకు:
1995లో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలు పోషించాడు.
6. శ్రీకృష్ణార్జున విజయం:
1996లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తండ్రి తరువాత కృష్ణ , అర్జున పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించిన వారసుడిగా బాలకృష్ణ గుర్తింపు పొందాడు..
ఇక ఇవే కాకుండా పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరి పిడుగు, ఒక్క మొగాడు, పాండురంగడు, సింహ, పరమవీరచక్ర, అధినాయకుడు, లెజెండ్, అఖండ వంటి సినిమాలలో డ్యుయల్ పాత్ర పోషించాడు బాలకృష్ణ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: