ఫ్లై క్యామ్ ఉపయోగించిన మొదటి తెలుగు చిత్రం..!

Divya
సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఏదైనా టెక్నాలజీ పరిచయం చేయాలంటే, అప్పట్లో అది కేవలం సూపర్ స్టార్ కృష్ణ కు మాత్రమే సాధ్యమైంది.. కానీ ఇటీవల మొదటిసారిగా ఫ్లై క్యామ్ ను ఉపయోగించి ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్లై క్యామ్ అనగానే ఇప్పటికే అందరికీ గుర్తొచ్చే ఉంటారు ఆ హీరో ఎవరు అని.. అతనే నందమూరి వారసుడు నందమూరి కళ్యాణ్ రామ్.. కళ్యాణ్ రామ్ నటించిన హరే రామ్ చిత్రానికి మొదటిసారిగా ఫ్లై క్యామ్ ను ఉపయోగించారని 2013లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఓం 3డి చిత్రానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని వెల్లడించారు.. హరే రామ్ కు ఫ్లై క్యామ్ ఉపయోగించిన మొట్టమొదటి తెలుగు భాషా చిత్రం అని కూడా ఆయన వెల్లడించారు..

ఇకపోతే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం గా 2008వ సంవత్సరంలో కళ్యాణ్ రామ్ హీరోగా డ్యుయల్  పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆర్ట్స్ కింద కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు. ఇందులో హీరోయిన్లుగా ప్రియమణి , సింధుతులానీలు నటించి తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.. ఇక ప్రధాన పాత్రల్లో బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, ఆలీ తదితరులు నటించిన ఈ సినిమాకు నవ్వులు-పువ్వులు పూయించారు.

కాకపోతే అప్పటి వరకు వరకు ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా కొంత ఊరటనిచ్చింది అని చెప్పవచ్చు. ఇక వాణిజ్య పరంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే కళ్యాణ్ రామ్ ఆ తర్వాత నటించిన ఏ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించకపోవడంతో ఆయన తిరిగి నిర్మాణ సంస్థలు చూసుకుంటూ ఎన్టీఆర్ నటించే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఇటీవల మరోసారి కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించటానికి రెడీ అవుతున్నాడు కల్యాణ్ రామ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: