ఎన్టీఆర్ "జై లవకుశ" కు ముందు ఇద్దరు దర్శకులు మారారట?

VAMSI
తెలుగు సినిమా చరిత్రలో అనేక ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించబడ్డాయి.  ఈ ప్రయోగాలలో భాగంగానే ఒకే హీరో రెండు పాత్రలలో నటించడం. వీటిని ద్విపాత్రాభినయం సినిమాలు అంటారు. ఇప్పటి వరకు ఒక హీరో డ్యూయల్ రోల్ పోషించిన సినిమాలు ఆ నాటి నుండి ఈ రోజు వరకు ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని సినిమాలు హిట్ కావు. అలాగే అన్ని సినిమాలు ప్లాప్ కావు. కేవలం కథను బట్టి సినిమాల ఫలితం ఆధారపడి ఉంటుంది. అలా త్రిపాత్రాభినయం చేసిన ఒక హీరో సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.  జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో మొట్టమొదటి సారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా "జై లవకుశ". ఈ సినిమా 2017 లో భారీ అంచనాలతో థియేటర్ లో విడుదల అయింది. ఈ సినిమాకు ముందు హ్యాట్రిక్ హిట్స్ ను కొట్టి మంచి ఊపుమీదున్నాడు ఎన్టీఆర్. వరుస హిట్ చిత్రాలు తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు కె ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. 

అయితే ఈ సినిమాకు ముందు బాబీకి డైరెక్టర్ గా పెద్ద అనుభవం లేదు. కేవలం పవర్ మరియు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు చేశాడు. వాటిలో ఒకటి అట్టర్ ప్లాప్. దీనితో బాబీకి అవకాశం ఇస్తున్న ఎన్టీఆర్ ను అందరూ రిస్క్ చేస్తున్నాడు అన్నారు. కానీ బాబీ చెప్పిన కథ వినడంతోనే సినిమా చెయ్యాలని ఎన్టీఆర్ కమిట్ అయ్యాడట.  ఆ విధంగా "జై లవకుశ" నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కింది. ఈ చిత్రం ద్వారా మొదటి సారిగా బాలీవుడ్ బుల్లితెర నటుడు రోనిత్ రాయ్ విలన్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో దర్శకత్వ ప్రతిభ కన్నా ముందు ఎన్టీఆర్ నటనను మెచ్చుకోవాలి. మూడు పాత్రలలో తను ఒదిగిపోయిన విధానం అద్బుతం అని చెప్పాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేతా థామస్ హీరోయిన్ లుగా చేశారు. పోసాని మరియు సాయి కుమార్ కీలక పాత్రలలో నటించి మెప్పించారు. ఈ సినిమా వెనుక చాలా కథ నడిచింది. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ సినీరచయిత వక్కంతం వంశీ డైరెక్షన్ లో సినిమా చేయాలనీ అనుకున్నారు. 

కానీ వంశీ చెప్పిన కథ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ లకు నచ్చకపోవడంతో ఆ సినిమాను పక్కకు పెట్టేశారు.  కానీ ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక కథను ఎన్టీఆర్ కు వివరించారు. కథ ప్రకారం అది ఒక అంధుని పాత్ర. అయితే ఎన్టీఆర్ దీనికి ఒప్పుకోలేదు. కొత్త ఐడియాతో రమ్మని అనిల్ ను కోరారట ఎన్టీఆర్. ఆ తర్వాత బాబీ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. తాను చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ కెరీర్ లో 27 వ సినిమాకు ముహూర్తం కుదిరింది. ఈ సినిమాకు ఇద్దరు సినిమాటోగ్రాఫర్ లు పనిచేయడం విశేషం. మొదటిగా సి కె మురళీధరన్ ఎంపిక అయ్యాడు. కానీ మూడు నెలల చిత్రీకరణ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత చోట కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వచ్చాడు.  ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన దేవి శ్రీ ప్రసాద్ బాణీలను సమకూర్చాడు. ఇందులో ఉన్న ఆరు పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "రావణ" సాంగ్ అయితే అధ్బుతంగా ఉంది. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రాణం... ప్రతి ఒక్క సీన్ లో అధ్బుతమైన నేపధ్య సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందించారు.
అన్నదమ్ముల మధ్యన ఉండే బంధాన్ని తెరపై అధ్బుతంగా చూపించారు దర్శకుడు బాబీ. తెలియని వయసులో తమ్ముళ్ళపై పగను పెంచుకున్న జై. ఆ తర్వాత వారి విలువను ప్రేమను అర్థం చేసుకుని చివరికి వారి కోసం తన ప్రాణాలను అర్పిస్తాడు. ఈ సినిమాలో డైరెక్టర్ ప్రతి ఒక్క సీన్ ను చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. వరుస విజయాలతో టాప్ లో ఉన్న ఎన్టీఆర్ తర్వాత చిత్రం కావడంతో అదనపు బాధ్యత బాబీ పై ఉంది.  ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొత్తం 45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జై లవకుశ టోటల్ రన్ లో 131 కోట్లు కలెక్ట్ చేసి నిర్మాత క్లాయాం రామ్ కు లాభాలను మిగిల్చింది. అలా వక్కంతం వంశీ తో చేయాల్సిన సినిమా ఆఖరికి బాబీ చెప్పిన కథతో పూర్తయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: