హీరో ల రేంజ్ లో ఆలోచిస్తున్న జగపతి!!

P.Nishanth Kumar
క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత జగపతిబాబు తన రేంజ్ ను కూడా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఎంతటి పెద్ద సినిమాలోనైనా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా చేయడానికి ముందుగా జగపతి బాబు నే సంపాదిస్తున్నారు. దీంతో ఆయనకు అన్ని భాషలలో డిమాండ్ బాగా పెరిగింది అని చెప్పాలి. లెజెండ్ చిత్రం లో ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టగా ఆ చిత్రంలోని విలన్ పాత్ర ఆయనకు గట్టి పునాది వేసింది. తెలుగులోనే కాకుండా తమిళం హిందీ కన్నడ మలయాళం హిందీ భాషల్లో సైతం దూసుకుపోతున్నాడు ప్రస్తుతం.
ఫ్యామిలీ చిత్రాల హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయిన అయిన జగపతి అప్పటికంటే ఇప్పుడు చేస్తున్న పాత్రలతోనే ఆయనకు ఎక్కువ పాపులారిటీ దక్కిందని చెప్పుకోవచ్చు. ఇంత బిజీగా ఉన్న ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నాడట. ఒక రోజుకు దాదాపు 25 లక్షల వరకు తీసుకుంటున్నాడట. ఈ నేపథ్యంలో 10 రోజులు షూటింగ్ ఉంటే రెండున్నర కోట్ల రూపాయల వరకు ఆయన పారితోషికం ఉంటుంది అన్నమాట. ఆయన ప్రస్తుతం పెద్ద పెద్ద సినిమాలలో నటిస్తున్నాడు.
 ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్, సలార్ తో పాటు మరిన్ని పాన్ ఇండియా సినిమాలలో కూడా ఆయన నటిస్తుండగా పెద్ద సినిమాల కోసం ఆయన ఎక్కువ రోజులు కాల్షీట్లు ఇవ్వాల్సి వస్తుండడంతో హీరోల రేంజ్ లోనే తను కూడా ఆలోచించాల్సి వస్తుందట. పారితోషికంగా డబ్బు ఎక్కువ ఇవ్వాలి అనుకునే నిర్మాతల నుండి ఆయన లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారట. అది కూడా థియరటికల్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తంలోనే ఆయనకు కొంత శాతం వాటా తీసుకుంటున్నారని తెలుస్తుంది. అడ్వాన్స్ గా కాకుండా మిగిలిన పారితోషకం బదులు జగపతి బాబు ఈ ఫార్ములా ఫాలో అవుతున్నారు అని తెలుస్తుంది. దర్శక నిర్మాతలు కూడా సంతోషంగా దీనికి ఓకే చెప్పారని అంటున్నారు.
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: