కాజల్ త్వరలోనే శుభవార్త చెప్పనుందా..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాదాపు రెండు దశాబ్దాల నుంచి వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉంది.కాజల్ కి ఇటీవల పెళ్లి అయిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత కూడా సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటూ బిజీ బిజీగా మారిపోయింది ఈ అందాల చందమామ.అయితే తాజాగా కాజల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది కాజల్.మన తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీల్లో కూడా..

 కాజల్ కు మంచి  ఆఫర్లు వస్తున్నాయి.అయితే కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో కలిసి నటించిన కాజల్ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించడం విశేషం. తాజగా ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున కాజల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.ఇదిలా ఉండగా గతేడాది కాజల్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు కాజల్.అయితే గతంలో కాజల్ కు వివాహం కాకముందే గర్భవతి అంటూ ప్రచారం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కాజల్ గర్భవతి అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అలాగే ఈ మద్య కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడంతో ఈ వార్తలు నిజమేనని కాజల్ అగర్వాల్ అభిమానులు భావిస్తున్నారు.అయితే కాజల్ స్పందిస్తే కానీ ఈ విషయం పై ఒక క్లారిటీ రాదు.ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లలో కూడా  కాజల్ అగర్వాల్ సైలెంట్ అయ్యారు. ఇకపోతే తన భర్త సినిమాలు వద్దు అని చెబితే ఇండస్ట్రీకి కూడా బై బై చెప్తా అంటూ కాజల్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు.పెళ్లి తర్వాత జాగ్రత్తగా తన కెరీర్ ను హ్యాండిల్ చేసుకుంటున్న కాజల్ ఇక మీదట ఇంకా హీరోయిన్ గా ఎన్నేళ్లు కెరీర్ ను కొనసాగిస్తారో చూడాల్సి ఉంది.ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ విషయం పై కాజల్ ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: