మళ్ళి గురూజీ సినిమాలో ఆమేనా .... ??

GVK Writings
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టిన సినిమా నువ్వే నువ్వే. తరుణ్, శ్రీయ నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, సుధా తదితరులు ఇతర పాత్రలు చేయగా ఫస్ట్ మూవీ తోనే మంచి సక్సెస్ కొట్టారు త్రివిక్రమ్. ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతడు మూవీ ఛాన్స్ కొట్టిన త్రివిక్రమ్ ఆ సినిమాని కూడ సూపర్ సక్సెస్ చేసారు.
అనంతరం పవన్ కళ్యాణ్ తో పాటు ఆపైన అల్లు అర్జున్ తో ఇలా వరుసగా పలువురు బడా స్టార్స్ తో సినిమాలు చేస్తూ వాటితో దర్శకుడిగా పలు బడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సొంతం చేసుకుని ఎంతో పేరుతో పాటు ఆడియన్స్ లో క్రేజ్ కూడా దక్కించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్యలో మహేష్ తో ఖలేజా, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి వంటి భారీ డిజాస్టర్ సినిమాలు కూడా తీశారు. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన తీసిన అరవింద సమేత, అలానే లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ తో ఆయన తెరకెక్కించిన అలవైకుంఠపురములో సినిమాలు రెండూ కూడా సూపర్ హిట్ కొట్టి త్రివిక్రమ్ క్రేజ్ మరింతగా పెంచాయి. ఇక త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు త్రివిక్రమ్.
ఇక తన సినిమాల్లో ఒక సీనియర్ నటిని తీసుకుని మూవీని మంచి ఆసక్తికరంగా ముందుకు నడిపే అలవాటు గల త్రివిక్రమ్, త్వరలో మహేష్ తో తీయనున్న సినిమాలో కూడా అటువంటి క్యారెక్టర్ ఒకటి రాసుకున్నారట. అయితే ఆ పాత్ర కోసం ఇటీవల పలువురు సీనియర్ నటీమణులని సంప్రదించిన త్రివిక్రమ్, ఆ పాత్ర కోసం చివరికి ఇటీవల అలవైకుంఠపురములో మూవీలో ముఖ్య పాత్ర చేసిన టబు నే మరొక్కసారి తీసుకోనున్నారనేది లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల టాక్. టబు కూడా పాత్ర నచ్చడంతో చేయడానికి ఒప్పుకున్నారట. అయితే దీనిపై అధికారికంగా సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది. కాగా త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: