చరణ్ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ చేయనున్న ఉపాసన .... ??

GVK Writings
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెండేళ్ల క్రితం డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన వినయ విధేయ రామ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీను తీసిన ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. అయితే తన నెక్స్ట్ సినిమాని రాజమౌళి తో చేయడానికి సిద్దమైన చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.
దానయ్య నిర్మించిన ఈ సినిమా కొన్నాళ్ల క్రితం షూట్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు శంకర్ తో ఒక గ్రాండ్ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు రామ్ చరణ్. కియారా అద్వారా మరొక్కసారి ఈ సినిమా ద్వారా చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం అఫీషియల్ గా లాంచ్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఇటీవల పూర్తి కాగా త్వరలో దీనిని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు మేకర్స్. ఎంతో భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని టాక్. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ సినిమాలో కొన్ని క్షణాల నిడివి ఉండే ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని నటించనున్నారని అంటున్నారు. ఆ పాత్ర చాలా చిన్నది కావడంతో ఆమె కూడా సరదాగా నటించడానికి ఒప్పుకున్నట్లు టాక్. మరి ఇదే కనుక నిజం అయితే తొలిసారిగా వెండితెరపై ఉపాసనని చూడవచ్చని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: