మహేష్ ఫ్యామిలీ గణేష్ చతుర్థి వేడుకల వీడియో వైరల్ ... !!

GVK Writings
టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ తో పాటు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఎక్కువగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రేక్షకాభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇటు తన ఫ్యామిలీ వ్యవహారాలు చూసుకోవడంతో పాటు అటు తన భర్త మహేష్ బాబు కి సంబందించిన పలు బిజినెస్ విషయాలు కూడా ఆమె దగ్గరుండి మరీ చూసుకుంటారని సమాచారం. మొత్తంగా ఘట్టమనేని ఫ్యామిలీ లో చాలా వ్యవహారాల్లో ఎంతో చక్కగా వ్యవహరిస్తూ అందరికీ తల్లో నాలుక వలె నమ్రత వ్యవహరిస్తుంటారని తెలుస్తోంది. అంతేకాదు ఇంటికి వచ్చిన వారిని ఆమె ఎంతో చక్కగా రిసీవ్ చేసుకోవడంతో పాటు మంచి ఆతిధ్యం కూడా ఆమె అందిస్తుంటారట.

మరోవైపు మహేష్ బాబు కూడా ఎక్కువగా తనకు షూటింగ్స్ లేని సమయంలో ఫ్యామిలీ తో కలిసి గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఏమాత్రం తనకు షూటింగ్స్ విషయమై లాంగ్ గ్యాప్ దొరికితే చాలు కుటుంబం తో సహా పలు దేశాలకు విహార యాత్రలకు వెళ్లి సేద తీరుతూ ఉంటారు మన సూపర్ స్టార్. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట షూట్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే మొన్నటి వినాయక చవితి పర్వదినాన్ని సూపర్ స్టార్ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో చక్కగా జరుగుపుకున్నట్లు తెలుస్తుంది.
కాగా ఆ వేడుకకు సంబంధించి ఒక చిన్న గ్లింప్స్ వీడియో ని మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. ఆ వీడియోలో మహేష్ నమ్రత, గౌతమ్, సితారతో పాటు పలు ఇతర వారి కుటుంబసభ్యులని కూడా చూడవచ్చు. ఆ గణనాధుడు మీ అందరికీ ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని అందించాలి అంటూ వీడీయో తో పాటు నమ్రత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్ ఎంతో వైరల్ అవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: