షాక్: అనసూయ తమ్ముడిగా బన్నీ...?

Sahithya
మన తెలుగు లో యాంకర్ అనసూయకు చాలా క్రేజ్ పెరిగింది. కొన్ని రోజుల నుంచి అనసూయ సినిమాల్లో కూడా ఎక్కువగానే నటించే ప్రయత్నం చేయడం అలాగే కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు రావడం వంటివి జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ తో పాటుగా సినిమాల్లో మంచి పాత్రలు వస్తే కచ్చితంగా నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. వయసు ఎక్కువగానే ఉన్నా సరే అనసూయ మాత్రం తన పాత్రల విషయంలో మంచి గ్లామర్ ఉన్నా లేకపోయినా పాత్రలో తనకు ప్రాధాన్యత ఉంటే మాత్రం సినిమాను వదులుకోడానికి ఇష్టపడలేదు.
రంగస్థలం సినిమా ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది అలాగే త్వరలో మరికొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కూడా అనసూయ కీలక పాత్రలు పోషించే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం కూడా జరుగుతోంది. అనసూయ అల్లు అర్జున్ కొరటాల శివ సినిమాలో హీరో కి అక్క పాత్రలో నటించే అవకాశం ఉందని దీనికి సంబంధించి ఇప్పటికే కథ కూడా ఇచ్చారని టాలీవుడ్ వర్గాల మాట.
ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో వస్తుందని ఆ సినిమాలో అనసూయ ఎమ్మెల్యే గా కనబడతారని ఎమ్మెల్యే తమ్ముడుగా అల్లు అర్జున్ నటిస్తారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అనసూయ పాత్రను కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. మరి ఆ పోస్టర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం ఆగాలి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. క్రిస్మస్ కు సినిమాను విడుదల చేయాలని భావించిన సరే కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: