ప్రభాస్ షాకింగ్ డెసిషన్...? సినిమాలకు బ్రేక్...?

Sahithya
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం పెరిగింది ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. బాహుబలి సినిమాలో ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమాలకు ఆశాదీపంలా కనిపించాడు ఇండియాలో ఉన్న నిర్మాతలకు. చాలా మంది స్టార్ దర్శక నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించటం ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకునే వాటిని వెంటనే షూటింగ్ మొదలు పెట్టడం వంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా ఏంటి అనేది క్లారిటీ లేదు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు మూడు సినిమాలకు భారీ బడ్జెట్ పెడుతున్నారు. అయితే ఈ సినిమాలు పూర్తయిన తర్వాత ఆయన భారీ బడ్జెట్ సినిమాలో దాదాపుగా చేసే అవకాశం లేకపోవచ్చు అనే కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమాలు చేయడం ద్వారా తన శరీరం అలసిపోతుంది అనారోగ్య సమస్యలకు కూడా తన గురయ్యే అవకాశం ఉందని ప్రభాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వయసు పెరుగుతున్న క్రమంలో ఇటువంటి ఒత్తిడి వద్దని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం చేసే సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మిగిలిన షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉందని ఇక ఇప్పట్లో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేవనే అంటున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాతల్లో కాస్త ఆందోళన మొదలైంది అనే మాటలు వింటుంటాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభాస్ బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడం ఇలాంటి క్రేజ్ పెరిగింది తరుణంలో అలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది కాస్త సంచలనమే అని కొంతమంది అభిమానులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: