సంచలన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు..?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు హీరోగా ఉన్నప్పటి కంటే విలన్ గా మారిన తర్వాతే ఆయనకి భారీ డిమాండ్ పెరిగిందని చెప్పాలి.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన 'లెజెండ్' సినిమాతో ఈయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. లెజెండ్ సినిమా తర్వాత జగపతిబాబు పూర్తి స్థాయి విలన్ గా మారిపోయాడు.ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ,మలయాళం,కన్నడ భాషల్లో సైతం బిజీ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నాడు ఈ సీనియర్ హీరో.ప్రస్తుతం జగపతిబాబు కాల్షీట్ల కోసం అగ్ర దర్శకనిర్మాతలు వేచి చూస్తున్నారు.క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నప్పటికీ జగపతిబాబు ఒక్కో సినిమాకి..ఒక రోజు షూటింగ్ కు గానూ 25 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అంటే 10 రోజులు షూటింగ్ ఉంటే మొత్తం 2.5 కోట్ల వరకు అందుకుంటాడన్న మాట.ప్రస్తుతం జగపతిబాబు ప్రభాస్ హీరో తెరకెక్కుతున్న 'రాధే శ్యామ్', 'సలార్' వంటి భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు.అలాంటి పెద్ద పెద్ద సినిమాల కోసం జగపతిబాబు ఎక్కువ రోజులు కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది.అయితే ఇదిలా ఉండగా తాజాగా జగపతిబాబు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అదేంటంటే..ఇక నుండిఆయన నటించే ప్రతీ సినిమాకి లాభాల్లో వాటాలు తీసుకుంటారట.అదికూడా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తంలోనే కొంత శాతం వరకు వాటా తీసుకుంటారట జగపతిబాబు.

అడ్వాన్స్ కాకుండా మిగిలిన రెమ్యునరేషన్ బదులు ఇలా లాభాల్లో వాటా తీసుకునే ఫార్ములాని ఫాలో అవుతారని తెలుస్తోంది.ఇక జగపతిబాబు నిర్ణయానికి దర్శకనిర్మాతలు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఓకే చెప్పినట్లు సమాచారం.ఇక సినిమా బిజినెస్ జరిగే వరకు వెయిట్ చేస్తేనిర్మాతలకి వడ్డీ రూపంలో కొంత డబ్బు మిగులుతుంది.కానీ జగపతిబాబు ఓ సినిమాకి ఎంత వాటా తీసుకుంటారు?దానికి ఆయన పెట్టే షరతులు ఏంటి అనే అంశాలపై ఇండ్రస్టీ లో పెద్ద చర్చే నడుస్తోంది ఇప్పుడు.ఏదేమైనా రెమ్యునరేషన్ విషయంలో జగపతిబాబు ప్లాన్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: