మన హీరో లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే?

P.Nishanth Kumar
టాలీవుడ్ పరిశ్రమ ఇప్పుడు గతంలోలా కళకళలాడుతుంది అని చెప్పొచ్చు. అందరు హీరోలు తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా కొత్త సినిమాలను కూడా చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మన అగ్రతారలు ఎవరెవరు ఎక్కడ తమ సినిమాల షూటింగ్లను జరుపుకుంటున్నారు అనేది చూద్దాం. కరోనా రెండో దశ తర్వాత టాలీవుడ్ లో వరుసగా షూటింగ్ లో జోరందుకున్నాయి. తమిళ తంబీలు కూడా తెలుగు రాష్ట్రాలకు వచ్చి చిత్రీకరణ చేస్తూ ఉన్నారు.

మన వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూడా తమ షెడ్యూల్స్ ను ప్రారంభించారు. ఏపీ లో ఒకరు, గోవాలో ఒకరు, విదేశాల్లో వేరొకరు ఇలా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తొలి భాగాన్ని క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు సుకుమార్ ప్రయత్నాలు చేస్తుండగా తాజాగా ఈ సినిమా చిత్రీకరణ కోసం అల్లు అర్జున్ కాకినాడకు చేరుకున్నారు.

అక్కడ పోర్టులో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు అని సమాచారం. ఇకపోతే బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ సినిమా షూటింగ్ కోసం ఆయన గోవా బయలుదేరారు. అక్కడ ఈ నెల 13వ తేదీన ఆఖరి షెడ్యూల్ పూర్తి చేయనున్నారట. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే లేదు.  ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లైగర్ సినిమా షూటింగు కూడా గోవాలోనే జరుగుతుంది. అక్కడ విలన్ తో తడబడే కొన్ని సీన్లను తెరకెక్కించనున్నారు చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఆచార్య సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు హైదరాబాద్ ముంబై లో ఒకే సమయంలో జరుగుతున్నాయి. అలాగే మహేష్ బాబు సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లో జరుగుతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: