అమీర్ ఖాన్ తో పోటీ వొద్దనుకుంటున్న బన్నీ

NIKHIL VINAY
ఇన్ని సంవత్సరాలు టాలీవుడ్ లోనే చక్రం తిప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళాలి అనుకుంటున్నాడు. బన్నీ కి బాగా క్లోజ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బన్నీ కి జోడిగా రష్మీక మందన్న నటిస్తుంది.సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో ఇంతముందు వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాల్లో బన్నీ నటనకి చాలా మంచి పేరు వచ్చింది. ఇక పుష్ప లో సుకుమార్ బన్నీ ని ఎలా చూపిస్తాడో అని అందరూ అభిమానులు వేచి చూస్తున్నారు.అయితే ఈ సినిమాని డిసెంబర్ లో క్రిస్మస్ కనుక గా విడుదల చేయాలి అని మూవీ టీం అనౌన్సమెంట్ కూడా వచ్చింది.

 అయితే ఇక్కడ పుష్ప కి పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటి అంటే అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా ఇదే క్రిస్మస్ కి విడుదల కాబోతుంది. బన్నీ కి ఇండియా అంత మంచి క్రేజ్ ఉంది కాని అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ తో పోటీపడితే మాత్రం పుష్ప కి కలెక్షన్స్ తగ్గే ఛాన్సులు చాలా ఉన్నాయి. ముఖ్యం బాలీవుడ్ జనాలు ఎక్కువగా అమీర్ ఖాన్ సినిమా అంటే ఎగబడతారు.అయితే ఇప్పుడు పుష్ప టీం అమీర్ ఖాన్ సినిమాతో పోటీ పడకుండా మూవీ విడుదల తేదీని మార్చబోతున్నారు అని టాక్.

ఇంతముందు అనుకున్నట్టుగా పుష్ప ని డిసెంబర్ 25న విడుదల చేయకుండా ఒక వారం ముందు అంటే డిసెంబర్ 17 న విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు.ఇక పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం క్లైమాక్స్ దశలో ఉంది. ఈ సినిమాలో బన్నీ గంధపు చెట్లని తీసుకెళ్లే స్ముగ్లేర్ గా కనిపించబోతున్నాడు. ఇక మలయాళం నటుడు ఫాహాద్ ఫాసిల్ విలన్ గా నటించడం విశేషం. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో వేచి చూడలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: