భీమ్లా నాయక్ : డేనియల్ శేఖర్ టీజర్ వచ్చేస్తోంది..?

Anilkumar
టాలీవుడ్లో ఇటీవల వకీల్ సాబ్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'.టాలీవుడ్ ప్రేక్షకులు అంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ సినిమా ఇది.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా దగ్గుబాటి రానా కూడా మరో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా 2022 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ ఒక రేంజ్ లో  వ్యూస్ సంపాదించుకుంటోంది.ఇదిలా ఉంటె భీమ్లా నాయజ్ టీజర్ గ్లిమ్స్ చివరలో రానా తన పేరును డేనియల్ శేఖర్ అంటూ చెప్పడం మనం గమనించవచ్చుప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ టీజర్ చూసిన తరువాత రానా కి సంబంధించిన టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు రానా ఫాన్స్.భీమ్లా నాయక్” టీజర్లో పవన్ ను మాత్రమే చూపించడంతో నెటిజన్లు మేకర్స్ పై ఫైర్ అయ్యారు. మల్టీస్టారర్ సినిమాను పవన్ సినిమా చేసేశారు అంటూ విమర్శించారు. దీంతో మేకర్స్ రానా కోసం కూడా ఓ ప్రత్యేక టీజర్ రెడీ అవుతోందని చెప్పడం జరిగింది.తాజా సమాచారం ప్రకారం డేనియల్ శేఖర్‌ టీజర్ కు ముహూర్తం ఖరారు అయ్యిందట.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 17 న డేనియల్ శేఖర్‌గా రానాకి సంబంధించిన టీజర్ విడుదల చేస్తారట.అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
పవన్ నటిస్తున్న “భీమ్లా నాయక్”సినిమా లో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు  కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.ఇకపోతే త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు.ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు.ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఇక డేనియల్ శేఖర్ పాత్ర కు సంబంధించిన టీజర్ ఈ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: