టిఫిన్ పెట్టిన వ్యక్తి కోసం బన్నీ ఏం చేసాడో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత స్టైలిష్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అలాగే అప్పుడప్పుడు చాలా సింప్లిసిటీని కూడా మెయింటైన్ చేస్తుంటాడు బన్నీ.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ షూటింగ్ కాకినాడలొనే కాకుండా  మారేడుమిల్లి ప్రాంతంలో కూడా జరుగుతుంది.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వర్షం కారణంగా ఆగినట్టు తెలుస్తోంది.అయితే షూటింగ్ లో బ్రేక్ లభించడంతో కాకినాడలోని థియేటర్‌లో గోపిచంద్ నటించిన 'సీటీమార్‌' చిత్రాన్ని అల్లు అర్జున్‌ వీక్షించారు.ఈ విషయం ఇలా ఉండగా గోకవరం సమీపంలో ఉన్న రోడ్ సైడ్‌ టిఫిన్ సెంటర్‌లో బన్నీ టిఫిన్ చేశారు.

కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.100 కోట్ల మార్కెట్ ఉన్న హీరో ఇంత సింపుల్‌గా ఉండటాన్ని చూసి  షాక్ అవుతున్నారు బన్నీ ఫాన్స్.ఈ వీడియో చూసిన అందరూ ఆయన సింప్లిసిటీకి ఫిదా అయిపోయారు.అయితే అక్కడున్న వాళ్లకు బిల్‌తో పాటు భారీగా టిప్ కూడా ఇచ్చారట అల్లు అర్జున్.ఇకపోతే టిఫిన్ సెంటర్ యజమానితో మాట్లాడి అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ కూడా  ఇచ్చాడట.ఈ వీడియో చూసినవారంతా బన్నీ ఉదారతని చూసి అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.బన్నీ ఇలా చేయడం మొదటిసారి ఏమి కాదు.గతంలో బన్నీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే.

బన్నీ నటిస్తున్న.... సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప సినిమాలో  రష్మిక మందన్న నటిస్తుంది. విలన్ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక పాట యూ ట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.దీనితో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న బన్నీ అభిమానులు.ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక ఈ సినిమా అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను చేయనున్నాడు బన్నీ.ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్టు పనులు పూర్తయినట్లు సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: