కృష్ణంరాజుకు పెనుప్రమాదం..!!

Divya
రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రమాదవశాత్తు సోమవారం ఆయన నివాసంలోని కాలు జారి కింద పడిపోయారు.. ఈ క్రమంలోనే ఆయన కాలి ఎముక విరిగినట్లు డాక్టర్లు తేల్చారు.. శస్త్ర చికిత్స చేయాలి అని చెప్పడంతో శస్త్ర చికిత్స కోసం కృష్ణంరాజును అపోలో ఆస్పత్రికి తరలించాలని మీడియా ప్రచారం జరుగుతోంది.. ఇక ఈరోజు ఉదయాన్ని కృష్ణంరాజుకు అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు అని అది విజయవంతం అయ్యిందని సమాచారం..

ఇకపోతే కృష్ణంరాజు ఎప్పటిలాగే రొటీన్ చెకప్ కోసం అపోలో ఆసుపత్రికి వచ్చారు అని ఆయన ఆఫీస్ నుంచి అధికారులు వెల్లడించారు.. అంతేకాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ అలాగే అతని కుటుంబ సభ్యులతో కూడా కృష్ణంరాజు మాట్లాడట.. త్వరలోనే కృష్ణంరాజు ఇండియా నుంచి యూకే వెళ్తున్నట్లు ఆయన కుటుంబం నుంచి సమాచారం తెలుస్తోంది.

ఇక కృష్ణంరాజు జీవిత విషయానికి వస్తే ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు గా 1945 సంవత్సరం జనవరి 20వ తేదీన జన్మించారు. కేవలం నటుడు మాత్రమే కాదు భారతీయ జనతా పార్టీ అలాగే ప్రజారాజ్యం పార్టీలో కూడా నాయకుడిగా వ్యవహరించాడు. కృష్ణంరాజు ఒక హీరోగా కంటే రచనలకు బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. మొదట లో ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఇక తన సినీ జీవితంలో 183 చిత్రాలకు పైగా నటించి గుర్తింపు పొందాడు. మొదటిసారిగా 1966వ సంవత్సరంలో చిలక గోరింక అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.
ఇక తర్వాత ఈయన నటన గాను ఐదు ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు మూడు రాష్ట్ర నంది అవార్డులు కూడా లభించాయి. వ్యక్తిగత విషయానికి వస్తే శ్యామల దేవి ని 1996 సెప్టెంబర్ 20వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇక ఈయన వారసుడిగా అంటే ఇతని తమ్ముడు కొడుకు ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ గుర్తింపు పొంది,తన స్థాయి ని  హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: