ఆ నిర్ణయం త్రిష కే వదిలేశారట!!

P.Nishanth Kumar
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ త్రిష ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు పూర్తిగా దూరం అయినట్లే కనిపిస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో వరుస సనిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము చిత్రంలో హీరోయిన్ గా ఆఖరి గా నటించింది. ఆ తర్వాత ఏ కమర్షియల్ చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా చేయలేదు. తెలుగులోకి ఆమె చేసిన తమిళ సినిమాలు అనువాదం అయ్యి సినీ త్రిష  అభిమానులను ఎంతగానో అలరించాయి.

అయితే ఇప్పుడు ఆమెకు తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఆమెకు హీరోయిన్ గా నటించాలని అవకాశాలు వస్తున్నాయట. దీంతో డేట్లు ఖాళీగా లేకపోవడంతో ఇద్దరిలో ఎవరో ఒక హీరోతో మాత్రమే సినిమా చేసే విధంగా ఆమె నిర్ణయం తీసుకుందట. గతంలో చిరంజీవితో బాలకృష్ణతో పెద్దగా సినిమాలు చేయలేదు త్రిష. వీరిద్దరితో నటిస్తే ఆమెకు తెలుగులో మంచి కం బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండు సినిమాలు చేస్తే మరీ మంచిది అంటున్నారు ఆమె అభిమానులు.

ఈ నేపథ్యంలో ఆమె ఇద్దరితో చేస్తుందా లేదా ఒక హీరోతో సినిమా చేస్తుందా అనేది చూడాలి.  చేతిలో పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో త్రిష మునుపటి కంటే బాగా బిజీగా ఉంది. దానికి తోడు ఓ టీ టీ  కంటెంట్ తో ఉన్న సినిమా ల్లో కూడా ఆమె నటించడం మొదలు పెడుతుంది. ఐటం సాంగులు చేయకపోయినా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ప్రత్యేక పాత్రలు చేస్తూ త్రిష బాగానే బిజీ గా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తెలుగులో ఎలాంటి ఎంట్రీ ఇస్తుందో చూడాలని కోరుకుంటున్న ప్రేక్షకులకు ఈ రెండు సినిమాల అవకాశాలు ఆమె తలుపు తట్టడం ఎంతో సంతోషం ఇస్తున్నాయి. మరి త్రిష ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో చూడాలి. తెలుగులో బాగా రాణించాలంటే ఈ రెండు సినిమాలను ఒప్పుకుంటే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: