మెగాస్టార్ చిరంజీవి ని టార్గెట్ చేసిన సంపత్ నంది..!

Pulgam Srinivas
తెలుగు యంగ్ డైరెక్టర్ సంపత్ నంది వరుణ్ తేజ్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన 'ఏమైంది ఈ వేళ' సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా అటు జనాలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందడంతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం గా నిలిచింది. ఈ సినిమా విజయంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం సంపత్ నంది కి కలిగింది. ఆ అవకాశం తో సంపత్ నంది, రామ్ చరణ్ హీరోగా 'రచ్చ'  సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో సంపత్ నంది తెలుగులో ఒక మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత సంపత్ నంది ఆచితూచి అడుగులు వేస్తూ రవితేజ హీరోగా తమన్నా, రాశికన్నా హీరోయిన్లుగా 'బెంగాల్ టైగర్' సినిమాను తెరకెక్కించాడు.

ఈ సినిమా సంపత్ నంది కి ఆశించిన విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా 'గౌతమ్ నంద' సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా సంపత్ నంది కి నిరాశనే మిగిల్చింది. కానీ ఇలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చిన కానీ అనుకోని కారణాలవల్ల ఆ అవకాశం చేజారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి గోపిచంద్ హీరోగా 'సీటిమార్' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ యంగ్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'సీటీమార్' సినిమా ట్రైలర్ ను చిరంజీవి కి చూపించి మంచి ప్రశంసలు కొట్టేసిన ఈ యంగ్ డైరెక్టర్ అదే జోష్ లో చిరంజీవి ఒక అదిరిపోయే కథను వినిపించి ఓకే చేయించుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: