ఫుడ్ , సెక్స్ రెండింటిలో మీకు ఏది ముఖ్యం..దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన శృతిహాసన్

Pulgam Srinivas
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. కానీ ఆ తర్వాత మాత్రం కమల్ హాసన్ పేరు పెద్ద ఉపయోగించుకోకుండా తనకు తాను స్వశక్తితో సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో సైతం ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి అగ్ర కథా నాయకి స్థానానికి ఎదిగింది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అప్పట్లో ఒకసారి కూడా ఇదే విధంగా చాట్ చేస్తూ తన పెళ్లి గురించి మరియు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.  ప్రస్తుతం కూడా అలాగే తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉన్న సందర్భంలో ఒక అభిమాని శృతిహాసన్ ను మీరు సెక్స్ మరియు ఫుడ్ ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని అడిగాడు.

 దానికి శృతిహాసన్ ఫుడ్ అంటూ సమాధానం ఇచ్చింది. ఎందుకంటే సెక్స్ లేకుండా మనం జీవించగలం కానీ ఫుడ్ లేకుంటే మాత్రం బ్రతకలేము. అంటూ శృతిహాసన్ తన సమాధానాన్ని చెప్పింది. ఈ రెండింటిని ఒకదానితో ఒకటి పోల్చడం తప్పు అన్నట్టుగా శృతిహాసన్ తన భావాన్ని వ్యక్తపరిచింది. ఇక శృతి హాసన్ వీటితో పాటే బిజినెస్ రంగం లోకి కూడా అడుగు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు అప్పట్లో ప్రకటించింది. బిజినెస్ లో భాగంగా ఫుడ్ కు సంబంధించిన బిజినెస్ లో అడుగు పెట్టాలని ముంబై లో సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలియజేసింది. ఇక శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే 'కేజిఎఫ్' సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'సలార్' సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: