తమన్నాకు.. మళ్ళీ కలిసొస్తుందా?

praveen
మిల్కీ బ్యూటీ తమన్నా..  ఈ అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. తెలుగు ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేసింది. తన అందం అభినయంతో అందర్నీ కట్టిపడేసింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు అందుకుని  ఒక రేంజ్ లో హవా నడిపించింది. ఇక ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది మిల్కీ బ్యూటీ తమన్నా.  తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులందరికీ విందు పెట్టింది అని చెప్పాలి. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లపాటు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న  తమన్నా ఇప్పుడు మాత్రం ఎక్కడ తెరమీద కనిపించడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 చాలా రోజుల నుంచి తెలుగు తెరకు దూరం అయిపోయింది.  ఒకవేళ కనిపించిన కేవలం స్పెషల్ సాంగ్స్ లో మాత్రమే మెరుస్తుంది. కానీ హీరోయిన్గా మాత్రం అవకాశాలు దక్కించుకోలేక పోతుంది.  అంతేకాదు ఇక దాదాపు దశాబ్దకాలం పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన తమన్నాకు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర కూడా పడిపోయింది. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉండటంతో.. ఇక తమన్నాకు అవకాశాలే కరువయ్యాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇలా ఎన్నో రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపించకుండానే పోయింది. బాహుబలి సినిమా తర్వాత  ఇప్పటివరకు హీరోయిన్ గా తమన్నా ఒక్క సినిమా మాత్రమే చేసింది. ఇక మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏకంగా ఒక స్పెషల్ సాంగ్ చేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ సినిమాతో తమన్నా మళ్లీ  హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించింది తమన్నా. ఎన్నో రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలకు దూరమైన తమన్నా.. ఇక సీటీమార్ తో హిట్ కొట్టడంతో.. ఇక ఈ అమ్మడి కెరియర్ గాడిలో పడుతుంది అని అనుకుంటున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: