రెండు దశాబ్దాలుగా చేస్తూనే ఉంది.. ఇప్పుడు కనిపించంట్లేదు..!!

P.Nishanth Kumar
తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ శ్రియ శరణ్ కు నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం హిందీ కన్నడ భాషల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటించగా అక్కడి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది ఈమె. నటన కు నటన అభినయానికి అభినయం రెండూ కలగలిపి తెలుగు సినిమాల ద్వారా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను అలరించింది.

2001 వ సంవత్సరంలో సినిమాల్లోకి వచ్చిన శ్రియ ఇప్పటికీ సినిమాలు చేస్తూ రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఆమె చేసిన రెండో సినిమా నే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. నాగార్జున సంతోషం సినిమా ఈమెకు మంచి హిట్ ను ఇవ్వడమే కాకుండా నటిగా ఎంతో గుర్తింపు వచ్చేలా చేసింది. ఆ తరువాత చెన్నకేశవరెడ్డి నువ్వే నువ్వే వంటి సినిమాలు ఆమెకు మంచి పాపులారిటీని తెచ్చిపెట్టాయి. మధ్యలో ఓ హిందీ సినిమా చేసి అక్కడ కూడా తెరంగేట్రం చేసింది.

అయితే ఆమెకు తెలుగు లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ఠాగూర్. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో దేవకి పాత్ర ద్వారా శ్రీయ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీయ కొత్త హీరోయిన్ల తాకిడి తో వెనుకబడిపోయింది. పెద్ద హీరోల సినిమాల అవకాశాలు పక్కన పెడితే నార్మల్ హీరో పక్కన కూడా హీరోయిన్ ఛాన్స్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం కొన్ని సినిమా లు చేస్తున్న ఆమె రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఓ కీలక పాత్ర లో నటిస్తుంది. ఈ సినిమా ఆమెకు మంచి కం బ్యాక్ ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: