హన్సిక సినీ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఇదేనా.?

Divya
బాలీవుడ్ లో బాలనటిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ, టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో మొదటి సారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, కుర్రకారు మనసు దోచుకున్న ముద్దుగుమ్మ. ఇకపోతే వరుస సినిమాలతో బిజీ అయి దక్షిణ భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేక కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి మకాం మార్చింది. అక్కడ వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉంది హన్సిక.

హన్సిక మోత్వాని..1991 ఆగస్టు 9వ తేదీన ప్రదీప్, మోనా దంపతులకు మహారాష్ట్రలో జన్మించింది. ఈమె తండ్రి ప్రదీప్ ఒక పెద్ద వ్యాపార వేత్త. తల్లి మోనా మోత్వాని చర్మ సంబంధిత డాక్టర్. హన్సిక పొద్దర్ అంతర్జాతీయ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నది. చదువుకునే సమయంలో ఎంతో యాక్టిివ్ గా  క్లాస్ లో  టాపర్ గా నిలిచింది..హన్సిక ఇంగ్లీషు, తెలుగు,  హిందీ, తుళు భాషలు మాట్లాడగలదు. అంతేకాదు ఈమె తన కుటుంబంలో జరిగే సాంస్కృతిక కార్యకలాపాలను కూడా పాల్గొనేది. ఇక ప్రత్యేకమైన నృత్యాలు కూడా ప్రదర్శించేది హన్సిక. ముఖ్యంగా తమిళ్ ,తెలుగు భాషలలో ఏకంగా 50 చిత్రాలకు పైగా నటించి తనకంటూ ఒక బెంచ్ మార్కును క్రియేట్ చేసుకుంది.
హన్సిక మొదట సీరియళ్లలోను, సినిమాలలో కూడా  చిన్నతనంలోనే నటించింది. ఇక  2001 వ సంవత్సరం నుంచే షకలక బూమ్ బూమ్.. హమ్ దో హై.. లాంటి  సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఈమె చిన్నప్పుడు బాలీవుడ్లో బాల నటిగా నటించి అక్కడ కూడా మంచి ప్రశంసలు అందుకుంది. నాటి నుంచి నేటి వరకు సినీ ఇండస్ట్రీలో చాలా చురుకుగా కనిపించే హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం హన్సిక అని మాత్రమే చెప్పవచ్చు.. ముద్దు ముద్దు మాటలతో అందమైన మోము తో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అవకాశాలు లేక తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: