లవ్ స్టోరీ పై సమంత మౌనం దేనికి సంకేతం !

Seetha Sailaja

గోపీచంద్ నటించిన ‘సిటీమార్’ కలక్షన్స్ అందరు భయపడినట్లుగా నెగిటివ్ గా లేదు. దీనితో ఈనెల 24న విడుదల కాబోతున్న ఈమూవీ ప్రమోషన్ ను చాలముందుగా మొదలుపెట్టేసారు. దీనికితోడు ఈమూవీ సోలో రిలీజ్ గా రావడంతోపాటు మిగతా సినిమాల నుండి పెద్దగా పోటీ లేకపోవడంతో ఈమూవీని చాల భారీగా ప్రమోట్ చేయబోతున్నారు.

నిన్న రిలీజ్ అయిన ఈమూవీ ట్రైలర్ ను చూసినవారికి ఈమూవీలో ఒకనాటి సూపర్ హిట్ అయిన ‘మరోచరిత్ర’ ఛాయలు కనిపిస్తాయి అని అంటున్నారు. ఈ ట్రైలర్ ను నిశితంగా చూసినవారికి డ్యాన్స్ స్టూడియో పెట్టాలనే కుర్రాడు సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ కావాలనుకునే అమ్మాయి ఇలా ఇద్దరూ ప్రేమలో పడడం ఆతరువాత వారి తల్లితండ్రుల ఇళ్ళలలో అభ్యంతరాలు అది తట్టుకోలేక ఆ ప్రేమ జంట ఇంటి నుంచి బయటకు పారిపోవడం లాంటి కీలక సన్నివేశాలు కనిపించడంతో ఈమూవీలో అక్కడక్కడ బాలచందర్ తీసిన ‘మరోచరిత్ర’ గుర్తుకు వస్తుందా అనే కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.

వీరిద్దరి ప్రేమకు ఇళ్లలో అభ్యంతరాలు ప్రేమ జంట జంప్ కావడం ఇలా అన్ని కీలక సన్నివేశాలు ఈ ట్రైలర్ లో కనిపిస్తూ ఉండటంతో చాలామంది రచయితలుగా మారిపోయి ఈమూవీ కథ ఇదే అంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టేసారు. ఇప్పటికే ఈమూవీలోని పాటలు చాల హిట్ కావడంతో ఈమూవీకి మొదటిరోజున ఈమూవీ టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది.

అయితే సోషల్ మీడియాలో ప్రతి విషయం పైనా స్పందించే హీరోయిన్ సమంత ఈ మూవీ ట్రైలర్ విడుదల అయి కొన్ని గంటలు గడిచినప్పటికీ ఎటువంటి స్పందన లేకుండా సమంత మౌనం వహించడం దీనికి సంకేతం అంటూ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి వీరిద్దరి వ్యక్తిగత జీవితం పై ప్రస్తుతం ఎన్నో రూమర్లు పుట్టుకు వస్తున్న పరిస్థితులలో ఇలా సమంత ఎంతకాలం మౌనం వహిస్తుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: