ఉపేంద్ర భార్య ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Divya
టాలీవుడ్ లో విలక్షణమైన నటనను ప్రదర్శించిన కన్నడ నటుడు హీరో ఉపేంద్ర మనందరికీ తెలిసిన నటుడే. ఈయన సినిమాలు చాలా భిన్నంగా ఉంటాయి. హీరో ఉపేంద్ర అతి బీద కుటుంబం నుంచి జన్మించిన వ్యక్తి. అంతేకాకుండా ఈయన చిన్నతనంలోనే కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు. ఇక తన చదువు పూర్తి చేసిన తరువాత తన బంధువైన కాశీనాథ్ ఉపేంద్రను సినిమాలలోకి ఆహ్వానించాడు.

అలా ఆయన సహకారంతోనే సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత 2003వ సంవత్సరంలో హీరోయిన్ ప్రియాంక ను పెళ్లి చేసుకున్నారు. ఉపేంద్ర, ప్రియాంక లది ప్రేమ వివాహం కావడం ఇక్కడ విశేషం. ఉపేంద్ర ఒక సందర్భంలో మాట్లాడుతూ.."రా"సినిమా సమయంలో తనకు ప్రియాంకకు మధ్య బాగా స్నేహం ఏర్పడిందని తెలియజేశాడు. ఇక ఆ తరువాత..H2O సినిమా ద్వారా వారి స్నేహం కాస్త పెళ్లి వరకు వెళ్ళింది అని చెప్పుకొచ్చారు.
ఇక అతి తక్కువ సమయంలోనే ఈమె  కన్నడ సంప్రదాయాలను మొత్తం నేర్చుకుందట. ఇక ఉపేంద్ర భార్య మిస్ కోల్ కత్తా గా కూడా ఎంపికైనట్లు సమాచారం. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ప్రియాంక పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలలో నటించినట్లు సమాచారం.

ఇక హీరో ఉపేంద్ర కూడా తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాలో ఈయన విభిన్నమైన క్యారెక్టర్లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక అంతే కాకుండా అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ గా కూడా నటించాడు. ఇక ఈ సినిమా ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏదిఏమైనా అటు హీరోగా ఇటు విలన్ గా బాగా రాణిస్తున్నాడు ఉపేంద్ర. ఇక ప్రస్తుతం ఇతని భార్య కూడా తెలుగులో నటించడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: