ఈసారి గట్టిగా కొట్టడం ఖాయం అంటున్నారు .... ??

GVK Writings
నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ప్రస్తుతం క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన మూవీ లవ్ స్టోరీ. ఇటీవల వరుణ్ తేజ్, సాయి పల్లవి ల కలయికలో శేఖర్ తీసిన ఫిదా మూవీ ఎంత పెద్ద సక్సెస్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య, సమంత ఇద్దరూ కూడా మధ్య తరగతి యువతీ యువకులుగా నటిస్తున్నట్లు నేడు విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ని బట్టి చెప్పవచ్చు. ఏమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల, నారాయణ్ దాస్ నారంగ్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈనెల 24న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఎంతో గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి సంగీత దర్శకుడు పవన్ అందించిన సాంగ్స్ అన్ని కూడా యువత ని ఎంతో ఆకట్టుకున్నాయి. నేడు విడుదలైన ట్రైలర్ కూడా అందరినీ అలరించడంతో పాటు సినిమా పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచింది అని చెప్పకతప్పదు. తెలంగాణ జిల్లాల్లో జరిగే కథగా, హీరో హీరోయిన్ ఇద్దరూ ఒకరంటే మరొకరు ఇష్టపడి ప్రేమించుకుని ఆపై తమ లైఫ్ లోని సమస్యలతో పాటు ప్రేమని కూడా చివరికి ఎలా సఫలం చేసుకున్నారు అనే కథాంశంతో ఈ మూవీ రూపొందినట్లు టాక్.
మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరుగడంతో 24న ఓపెనింగ్స్ బాగా రావడం ఖాయం అని, ఇక మూవీ కనుక మంచి టాక్ ని సొంతం చేసుకుంటే అద్భుతమైన కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరోవైపు లవ్ స్టోరీ మూవీపై సినీ వర్గాల్లో కూడా మంచి పాజిటివ్ బజ్ ఉండడం కూడా సినిమాకు కలిసి వచ్చే అంశం అని టాక్. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే ఈ లవ్ స్టోరీ మూవీతో యూనిట్ గట్టిగా పెద్ద సక్సెస్ కొట్టే ఛాన్స్ కనపడుతోందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: