ఆ మూవీని ఎన్టీఆర్ ప్రక్కన పెట్టినట్లేనా .... ??

GVK Writings
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా ఆది. దాదాపుగా 19 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ మాస్ యాక్షన్ మూవీ భారీ సక్సెస్ కొట్టి హీరోగా ఎన్టీఆర్ కి అలానే దర్శకుడిగా వినాయక్ కి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టింది. అనంతరం మరొక్కసారి ఎన్టీఆర్ తోనే వినాయక్ తీసిన సినిమా సాంబ. ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తరువాత యావరేజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆ తరువాత కొన్నాళ్ల అనంతరం ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ తో వినాయక్ తీసిన మూవీ అదుర్స్. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో నయనాతార, షీలా హీరోయిన్స్ గా నటించగా ఇందులో ఎన్టీఆర్ పోషించిన చారి పాత్రలో నటనకు గాను ఆడియన్స్ నుండి మంచి పేరు లభించింది. ఇక విడుదల తరువాత సూపర్ సక్సెస్ అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ ని తీయాలనే ఆలోచన తనకు ఉన్నట్లు గతంలో పలు ఇంటర్వ్యూస్ లో భాగంగా వి వి వినాయక్ వెల్లడించారు. అయితే అది ఇప్పటివరకు సెట్ కాలేదు. ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆ మూవీ ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని అంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్, త్వరలో కొరటాల శివ మూవీ చేయనున్నారని, అది పూర్తి కావడానికి వచ్చే ఏడాది ద్వితీయార్ధం వరకు పట్టనుండగా, అనంతరం వెంటనే మైత్రి మూవీ మేకర్ వారి బ్యానర్ పై ప్రశాంత్ నీల్ తీయనున్న మూవీ షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నారని, ఆ సినిమా దాదాపుగా ఏడాదికి పైగా షూట్ జరుపుకునే ఛాన్స్ ఉందని సమాచారం.
ఇవివి మాత్రమే కాకుండా ఇప్పటికే మరొకవైపు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో పాటు మరొక స్టార్ డైరెక్టర్ తో కూడా ఎన్టీఆర్ సినిమాలు చేయాల్సి ఉందని, దీనిని బట్టి ఇవన్నీ పూర్తి కావడానికి మరొక మూడు నుండి నాలుగేళ్లు పట్టనుండగా, ఆ తరువాతనే వినాయక్ అదుర్స్ 2 ప్రాజక్ట్ ప్రస్తావన వస్తుందని అంటున్నారు. మరి ఇంతకీ ఎన్టీఆర్, వినాయక్ ఇద్దరూ ఆ ప్రాజక్ట్ ని ప్రక్కన పెట్టారా లేక తీస్తారా అనేది తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: