యాడ్స్ కే ఇలా అయిపోతే ఎలా ... రేపు మూవీ లో మంచి మ్యాటర్ ఉందట ... ??

GVK Writings
టాలీవుడ్ హ్యాండ్సమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు కొన్నేళ్లుగా యాడ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. థమ్స్ అప్ వంటి నేషనల్ బ్రాండ్ తో పాటు అనేకమంది పలు పెద్ద బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు మన సూపర్ స్టార్. హీరోగా మహేష్ బాబు ఇప్పటివరకు బై లింగ్యువల్ మూవీ స్పైడర్ మినహాయించి మరొక ఇతర భాష సినిమా ఏది కూడా చేయలేదు.
అయినప్పటికీ కూడా నార్త్ సహా పలు ఇతర భాషల్లో హీరోగా ఆయనకు ఎనలేని ఖ్యాతి ఉంది. ఆ విధంగా తన పాపులారిటీ ఉంది కాబట్టే పలు బ్రాండ్స్ కూడా ఆయన చుట్టూనే తిరుగుతున్నాయని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట వేగవంతంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. కీర్తి సురేష్ కథానాయికగా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పరశురామ్ దీనిని యాక్షన్ కమర్షియల్ మూవీ గా ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే మ్యాటర్ ఏంటంటే, లేటెస్ట్ గా మహేష్ బాబు నటించిన పాన్ బహార్ ఇలాచీ యాడ్ రెండు రోజుల క్రితం యూట్యూబ్ లో విడుదలై మంచి క్రేజ్ అందుకుంటోంది. ఈ యాడ్ హిందీ వర్షన్ లో సాగగా బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి సూపర్ స్టార్ మహేష్ నటించారు. ఇక ముఖ్యంగా ఈ యాడ్ లో ఫుల్ లాంగ్ హెయిర్, అలానే హాలీవుడ్ లో లుక్స్ లో మహేష్ బాబు అదిరిపోవడంతో పలువురు ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ఎంతో మురిసిపోతున్నారు. అయితే ఇది కేవలం యాడ్ మాత్రమే, రేపు విడుదల కాబోయే సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ని ఈ హ్యాండ్సమ్ లుక్ లో చూస్తే అభిమానులు ఏమైపోతారో అంటూ పలువురు సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: