సాహో తో కానిది రాధే శ్యామ్ వల్ల అవుతుందా!!

P.Nishanth Kumar
బాహుబలి సినిమా తో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ఆ ఇమేజ్ను రెట్టింపు చేసుకునే ప్రయత్నంలో సాహో సినిమా ను చేయగా అది బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచింది.  బాహుబలి సినిమా తో వచ్చిన అమేయమైన ఇమేజ్ తో సాహో లాంటి ఫ్లాప్ సినిమా ను చేసిన ప్రభాస్ కు ఆ ఇమేజ్ తగ్గిపోలేదు కానీ పాన్ ఇండియా హీరో అయ్యాక సినిమాల ఎంపికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభాస్ కు ఒక పాఠం నేర్పించింది ఆ సినిమా.

ఇక కనివిని ఎరుగని విజయం వరించిన ఏ హీరో పైన అయినా తదుపరి సినిమా కి అతనిపై భారీ ఒత్తిడి ఉండడం సర్వసాధారణం.  ఆయన తదుపరి సినిమాపై కూడా అంచనాలు అంబరాన్ని అంటుతాయి.  వాటిని అందుకోవడం అంత తేలిక కాదు. గతంలో చాలా మంది హీరోల విషయంలో ఇదే జరిగింది. ముఖ్యంగా రాజమౌళితో సినిమాలు చేసిన హీరో ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన దర్శకత్వ ప్రతిభతో సదరు హీరోని వేరే ఏ రేంజ్ లో చూపిస్తాడు జక్కన్న. అలా ఆ హీరో తదుపరి సినిమా ఇంకొక దర్శకుడి తో చేసే సరికి అక్కడ తేలి పోతాడు.  అలా ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సాహో సినిమా లో పూర్తిగా తేలిపోయాడు.  

ఇప్పుడు మరొకసారి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధేశ్యాం సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా వెండి తెర మీద చూసి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా సాహో సినిమా తో కొట్ట లేని భారీ హిట్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాతో నైనా ప్రభాస్ కొడతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: