బోలా శంకర్ సినిమా కోసం అలాంటి లుక్ లో కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరియర్ మంచి బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించి చాలా సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే సినిమాలో మళ్లీ నటించాలనే ఉద్దేశంతో చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద  మంచి విజయంగా నిలిచింది. ఇదే జోష్ లో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి మరియు దేశ వ్యాప్తంగా విడుదల చేసి కుర్ర హీరోలకు నేనేమీ తక్కువ కాదు అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మరియు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో పాటే మెగాస్టార్ చిరంజీవి 'లూసిఫర్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' లో కూడా నటిస్తున్నాడు. అయితే ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా 'వేదాళం' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న 'బోలా శంకర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి భిన్నమైన గెటప్ లో కనిపించబోతున్నాడు అని ఫిల్మ్ నగర్ లో ఓ టాక్ వినపడుతోంది. అయితే చిరంజీవి సినిమాలో ఒక పాత్రలో గుండుతో  కనపడతాడు అంటూ ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇలా చిరంజీవి కొత్తరకం గెటప్ లో కనిపించనున్నాడు అని తెలియడంతో మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచుకొంటున్నారు. ఈ సినిమాతో పాటే మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ప్రార్థన ఈ మధ్యనే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: