అల తో అలా బంపర్ హిట్ కొట్టిన బన్నీ .... ??

GVK Writings
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ కం ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ అలవైకుంఠపురములో. త్రివిక్రమ్ మార్క్ స్టైల్ పంచెస్ కి అల్లు అర్జున్ స్టైలిష్ యాక్షన్ కూడా తోడవ్వడంతో ఈ మూవీ దాదాపుగా చాలా ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది. టాలీవుడ్ బడా సంస్థలు గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా పీఎస్ వినోద్ ఛాయాగ్రాహకుడిగా పని చేసారు.
విడుదలకు ముందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా విడుదల తరువాత పెద్ద సక్సెస్ అందుకోవడంతో పాటు ఇందులో సాంగ్స్ కూడా విశేషమైన ఆదరణని దక్కించుకున్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు థమన్ అందించిన సాంగ్స్ మాత్రమే కాక పలు సీన్స్ లో బీజీఎమ్ కూడా ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంది. అలానే ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ గా నటించిన యువ భామ పూజా హెగ్డే నటనకి కూడా మంచి పేరు దక్కింది.
ఇక కీలక పాత్రల్లో నటించిన మురళి శర్మ, టబు, రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, వెన్నెల కిషోర్, సచిన్ ఖేడేకర్ వంటి వారు తమ సహజ నటనతో ఆడియన్స్ ని ఎంతో అలరించారు. దర్శకుడు త్రివిక్రమ్ తన పెన్ కి బాగా పదును పెట్టి రాసారేమో, ఇందులో కొన్ని డైలాగ్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకాభిమానుల నోటి వెంట వినపడుతూ ఉంటాయి. ఎక్కడా కూడా తన మార్క్ టేకింగ్ ని మిస్ చేయకుండా, మరోవైపు అల్లు అర్జున్ ఇమేజ్ కి తగ్గట్లుగా స్టోరీ ని ముందుకు నడిపించారు త్రివిక్రమ్. నిజానికి ఈ సినిమాకి ముందు కెరీర్ పరంగా వరుసగా పరాజయాలు చవిచూసిన అల్లు అర్జున్ కి అలవైకుంఠపురములో సినిమా పెద్ద బ్రేక్ ని ఇచ్చింది  అని చెప్పకతప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: