చైతు-సామ్ విడాకులు నిజమేనా.. సమంత ట్వీట్ వైరల్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగచైతన్య సమంత ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  వీరి ప్రేమ నుండి పెళ్లి వరకు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడు సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది.  పెళ్లి తర్వాత సమంత సినిమాలను ఆపేస్తుంది అనుకున్నప్పటికీ నాగచైతన్య మాత్రం సమంత ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేసేందుకు అంగీకరిస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే అటు సమంత కూడా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా మారిపోయింది.  ఇద్దరు కూడా ఎక్కడైనా కనిపించారు అంటే అందరి చూపులు ఆకర్షిస్తూ ఉంటారు.

 ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు.  అలాంటి ఈ అక్కినేని జంటపై గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త వైరల్ గా మారిపోయింది. నాగచైతన్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అని.. వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడ్డాయి అంటూ ఎన్నో రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.  దీనిపై ఇప్పటివరకు నాగచైతన్య సమంత ఎక్కడా స్పందించలేదు. కానీ వీరిపై వస్తున్న రూమర్లను మాత్రం ఎక్కడా ఆగడం లేదు.  ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే చర్చ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  ఇకపోతే ఇటీవల అక్కినేని వారి కోడలు సమంత చేసిన పని నాగచైతన్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తకు కాస్త బలం చేకూర్చింది అనే చెప్పాలి.

 ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య సరసన నటించింది. కాగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి  ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల మదిని తాకుతుంది అని చెప్పాలి  అయితే ఇటీవలే విడుదలైన లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పై సమంత చేసిన ట్వీట్  వైరల్ గా మారిపోయింది. లవ్ స్టోరీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పిన సమంత అటు సాయి పల్లవి ని టార్గెట్ చేస్తూ స్పెషల్ విషెస్ చెప్పింది. కానీ నాగచైతన్యను మాత్రం ఎక్కడ ట్యాగ్ చేయలేదు.  దీంతో మరోసారి నాగచైతన్య సమంత నిజంగానే విడాకులు తీసుకోబోతున్నట్లు  టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: