పెళ్లి సందడి కి అంతా సీన్ ఉందా!!

P.Nishanth Kumar
రాఘవేంద్రరావు కే దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి.  రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమా కి కొనసాగింపు గా కాకున్నా ఆ టైటిల్ తో ఈ సినిమా రాబోతుండగా ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీల అనే ఓ కొత్త అమ్మాయి నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. రాఘవేంద్ర రావు దర్శకుడు తన సూపర్ హిట్ సినిమాని రీమేక్ చేయడం వంటివి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉండడంతో పాటు ఆయన చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహించడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి ముఖ్య కారణాలు.

కే కృష్ణ మోహన రావు సమర్పణలో ఆర్కా మీడియా మరియు అసోసియేట్స్ బ్యానర్లపై కోవెలమూడి మాధవి మరియు శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ప్రస్తుతం నిర్మాానంతర పనులు జరుపుకుంటున్నాయి.  హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ఎమోషన్స్ కామెడీ వంటి అన్ని అంశాలతో మిళితమై ఉన్న ఈ సినిమా ను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసి మరొక సంచలన చిత్రాన్ని ప్రేక్షకుల ముందు కు రాబోతున్నారు అని చిత్ర బృందం చెబుతుంది. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండడం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దానికి కారణం ఏమిటంటే దసరా కానుకగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొండపొలం మహాసముద్రం పుష్పకవిమానం అఖండ ఆచార్య వంటి సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు చిత్రబదం ధైర్యం చేయడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది.  ఈ నేపథ్యంలో రాఘవేంద్ర రావు రోషన్ తో కలిసి చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: