దసరా కి రానున్న మరో ఇంట్రెస్టింగ్ సినిమా..!!

P.Nishanth Kumar
దసరా కానుకగా థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.  ఇప్పటికే అక్టోబర్ 8వ తేదీన మరియు 14వ తేదీన వరస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.  ఈ నేపథ్యంలో మరొక చిన్న సినిమా కూడా దసరా నీ టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు కొందపోలం సినిమాలు అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.  ఆ తర్వాత వచ్చే వారం అక్టోబర్ 14న మహా సముద్రం సినిమా రాబోతుంది.

 వీటితో పాటే పెళ్లిసందడి సినిమా కూడా అదే టైం లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.  అంతే కాకుండా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా కూడా ఏదో ఒక తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాలని భావిస్తూ ఉండగా కంటెంట్ ను నమ్ముకొని సినిమాలు చేసే హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన పుష్పక విమానం సినిమా కూడా అక్టోబరు 8న కానీ అక్టోబర్ 14న కానీ ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తుండటం విశేషం. 

మిడిల్ క్లాస్ మెలోడీస్, దొరసాని సినిమాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ తన మూడవ సినిమా పుష్పకవిమానం సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. మరి ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉండగా ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం అందరిలో ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. మరి తమ్ముడు కూడా అన్నలాగే హిట్లతో చరిత్ర సృష్టిస్తా డా టాలీవుడ్ లో తనకంటూ ఒక పేజీ రాసుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: