చైతు సినిమాపై సమంత కామెంట్ ? ఇక రూమర్స్ చెక్ పెట్టినట్టే !

NIKHIL VINAY
గత కొంతకాలంగా సమంత కి చైతు మధ్య గొడవలు జరుగుతున్నాయి అని సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి అందరికి తెలిసిందే. వీటికి చెక్ పెట్టడానికి సమంత , చైతు ఇద్దరు రెస్పాండ్ అవ్వలేదు. ఇక చైతన్య ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన లవ్ స్టొరీ సినిమా ఎన్నో సార్లు పోస్ట్ పోన్ అవుతూ చివరగా సెప్టెంబర్ 24 న విడుదల కాబోతుంది అని మూవీ టీం ప్రకటించి ట్రైలర్ ని విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ని సమంత షేర్ చేసి విన్నర్ అని కామెంట్ పెట్టింది. అలాగే లవ్ స్టొరీ సినిమా టీం కి విషెస్ చెప్పింది. ఇక ఈ కామెంట్ తో అన్న వీరి మీద వచ్చే రూమర్స్ తగ్గుతాయో లేదో చూడాలి.ఇక నాగ చైతన్య ప్రస్తుతం హిందీలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. అలాగే ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో థాంక్ యు సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయనకి జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక ఆయన  లవ్ స్టొరీ సినిమా విషయానికి వస్తే విడుదలైన ట్రైలర్ చాలా బాగుంది. శేఖర్ కమ్ముల కి బాగా అచ్చి వచ్చిన ప్రేమ కథ ఫార్ములా ని మళ్ళీ స్క్రీన్ మీదకి తెస్తున్నాడు.ఒక డాన్స్ స్కూల్ పెట్టాలి అనుకునే అబ్బాయి , ఒక సాఫ్ట్ వెర్ జాబ్ కావాలని అనుకునే అమ్మాయి మధ్య జరిగిన అందమైన ప్రేమ కథగా ఈ సినిమా రాబోతుంది.  ఈ సినిమా పాటలు ఇప్పటికే అన్ని సూపర్ హిట్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: