సీటిమార్ తో మెగా ఛాన్స్ కొట్టేసిన సంపత్ నంది...

NIKHIL VINAY
డైరెక్టర్ సంపత్ నందికి హిట్స్ పెద్దగా లేకపోయినా కూడా కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన ఏమైంది ఈ వేళా , రచ్చ , బెంగాల్ టైగర్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఈమద్య ఆయనకి సరైన హిట్ రాలేదు. అయితే ఒక్క హిట్ ఇండస్ట్రీలో లెక్కలు అన్ని మార్చేస్తుంది. అలాంటి హిట్ సంపత్ నంది కి సీటిమార్ సినిమాతో వచ్చినట్టే ఉంది. ఈ సినిమా ఈ మద్యనే విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తుంది. అయితే సీటిమార్ సినిమా సంపత్ నంది కి ఒక బంపర్ ఆఫర్ ని తెచ్చినట్టే ఉంది.

అదేంటి అంటే మెగాస్టార్ చిరు ని ఈ సినిమా ప్రమోషన్స్ లో కలిసిన సంపత్ నంది ఆయనకి ఒక స్టోరీ లైన్ వినిపించాడు అని టాక్. అది మెగాస్టార్ కి చాలా బాగా నచ్చిందట. అయితే త్వరలోనే ఈ ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాక్ వినిపిస్తుంది. ఇది నిజం అయితే మాత్రం సంపత్ నంది ఒక్కసారిగా టాప్ డైరెక్టర్ అయిపోడం గ్యారెంటీ గా కనిపిస్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ వరసగా సినిమాలని ఒప్పుకుంటు బిజీ బిజీగా ఉన్నారు. ఇదే ఊపులో సంపత్ నంది ప్రాజెక్ట్ కూడా ఓకే చేస్తాడేమో చూడాలి. ప్రస్తుతం చిరు మలయాళం లుసిఫార్ రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాథర్ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.

ఇది పూర్తి అయిన వెంటనే భోళా శంకర్ సినిమా మొదలవుతుంది.ఈ సినిమాతో పాటుగా బాబీ డైరెక్షన్ లో ఇంకొక సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇక ఈ సినిమాలే కాకుండా చిరు కొత్త డైరెక్టర్స్ దగ్గర కూడా కథలు వింటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ సినిమాలా లైనప్ చూసి యంగ్ హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఆయన నటిస్తున్న సినిమాల్లో గాడ్ ఫాథర్ , భోళా శంకర్ వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: