మళ్లీ ఇలియానా ను దింపుతున్నారా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎన్నో గొప్ప గొప్ప హిట్ చిత్రాలను చేసి స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాల పాటు ఏలింది ఇలియానా. గోవా బ్యూటీ గా ప్రేక్షకుల ను తన నడుము అందాలతో పిచ్చెక్కింది ఇల్లీ బేబీ రామ్ హీరో గా నటించిన దేవదాసు చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి మొదటి సినిమా తోనే అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమా లో ఆమె పొడుగాటి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆమె చేసిన రెండవ సినిమా ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ది అందుకుంది.

పోకిరి సినిమా ఆమెను ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మార్చింది అని చెప్పవచ్చు. ఆ తరువాత తెలుగులో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ఆమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేయగా అక్కడ కొంత మేరకు రాణించింది. ఆ తర్వాత తెలుగు సినిమా సినిమాలకు దూరమైన ఇలియానా మళ్లీ  రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తో రీ ఎంట్రీ చేసింది. తెలుగు లో మళ్లీ రానించవచ్చు అని ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్ళీ తెలుగులో మరొక సినిమా చేయలేకపోయింది ఇలియానా. 

ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలు చేసినా కూడా అవి ఆమెకు కలిసి రాలేదు. దీనికితోడు ఆమె ప్రేమలో విఫలం కావడం కూడా ఆమెను మరింత డిప్రెషన్ కు వెళ్లేలా చేసింది. తాజాగా ఈమె బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది అనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అఖండ సినిమా పూర్తి చేసిన బాలకృష్ణ తొందర్లోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే రౌడీయిజం సినిమాలో హీరోయిన్ గా ఈమె సెలెక్ట్ అయిందని వార్తలు రాగా ఇప్పటికే ఓ హీరోయిన్ త్రిష ఎంపిక అవగా మరో హీరోయిన్ గా ఇలియానా  ఇలియానా ఎంపిక అయ్యింది అంటున్నారు. భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: