మరో భారీ డీల్ కుదుర్చుకున్న రాంచరణ్...?

murali krishna
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటుడిగానే కాదు కొన్ని సార్లు నిర్మాతగానూ అలాగే బిజినెస్ మాన్ గాను రాణిస్తున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే పలు బిజినెస్ లు చేస్తున్న ఈయన తాజాగా మరో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
ప్రముఖ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ సంతకం చేసినట్లు తెలుస్తోంది.బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఒప్పుకున్నట్లు సమాచారం.తమ సంస్థకు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడంపై సదరు సంస్థ కూడా సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ డీల్ ఒక సంవత్సరం పాటు కొనసాగుతుందని సమాచారం.తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ కారణంగా తమ యాప్ కు సభ్యులుగా మారడానికి మిలియన్ల మంది చందాదారులు ఆకర్షితులవుతారని హాట్‌స్టార్ నిర్వహకులు అంచనా వేస్తున్నారని తెలుస్తోంది..అలాగే హాట్‌స్టార్ ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లు మరియు చలనచిత్రాలతో సహా అనేక తెలుగు ఒరిజినల్స్ రూపొందించడంపై దృష్టి సారించిందని సమాచారం.
ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్దమవుతున్న సమయంలో రామ్ చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేర్చడం వలన ఆయన అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం వలన OTT వైపు ఎక్కువ మందిని ఆకర్షించడానికి వీలుంటుందని అంత అంటున్నారని సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..
ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అదిరిపోతుందని సమాచారం.ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానుల నిరీక్షణ ఇప్పట్లో తీరేలా లేదని తెలుస్తుంది.అలాగే చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ లోను చరణ్ ప్ఒక అధ్బుతమైన పాత్ర పోషించాడని సమాచారం. రీసెంట్ గా శంకర్ మూవీ ని కూడా రామ్ చరణ్ ప్రారంభించినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: