ఆచార్య ఎఫెక్ట్ ఎన్టీఆర్ సినిమా మీద పడిందా?

NIKHIL VINAY
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఈ సినిమా షూటింగ్ చాలారోజుల కరోన వలన ఆగిపోయింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్న విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఇక కొరటాల కూడా ఆయన చేయబోయే సినిమాలని పక్కన పెట్టి ఈ సినిమా మీదనే కష్టపడుతున్నాడు. అయితే ఆచార్య సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు ఆయన చేయబోయే ఎన్టీఆర్ సినిమా మీద కూడా పడింది. అది ఎలా అంటే కొరటాల శివ ముందుగా ఎన్టీఆర్ కి ఒక లైన్ లో స్టోరీ చెప్పాడు. అది ఎన్టీఆర్ కి చాలా బాగా నచ్చింది.ఇక వెంటనే ఈ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే ఈ మద్యనే కొరటాల శివ ఎన్టీఆర్ కి ఫుల్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చాడట. అయితే ఈ ఫుల్ స్క్రిట్ ఎన్టీఆర్ కి అంత గొప్పగా ఇంప్రెస్ చేయలేదు అని టాక్. దీనికి కారణం కొరటాల శివ ఆచార్య సినిమా పనిలో పడి ఎన్టీఆర్ సినిమా మీద సరైన ఫోకస్ పెట్టకపోవడం వలన ఇలా జరిగింది అని టాక్. ఇక ఈ సినిమా నవంబర్ లో మొదలుకాబోతుంది. ఈ సినిమాలో పీరియడికల్ బాక్ డ్రాప్ లో కూడా ఫ్లాష్ బాక్ ఉంటుంది అని టాక్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ని ఇంకా ఫిక్స్ కాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఇంతకముందు సినిమా జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో ఎన్టీఆర్ 30వ సినిమాకి ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల కాబోతుంది. కళ్యాణ్ రామ్ , సుధాకర్ ఇద్దరు నిర్మాతలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: