బాల‌య్య - గోపిచందు సినిమా టైటిల్ ఇదేనా?

Dabbeda Mohan Babu
బాల‌య్య సినిమా అంటేనే మాస్ అభిమానుల‌కు పండ‌గే. బాల‌య్య తీసిని దాదాపు అన్ని యాక్ష‌న్ సినిమాలు బాక్సాఫీస్ ను ఊపేసాయి. యాక్ష‌న్ సినిమాలు బాల‌య్య కు సెట్ అయ్య విధంగా ఎ హిరోకు కూడా సెట్ కావు. అందుకే యాక్ష‌న్ సినిమాలు తీయ‌డానికి డైరెక్ట‌ర్ లు బాల‌య్య‌ ముందు క్యూ క‌డుతారు. ఇక బాల‌య్య, బోయ‌పాటి కాంబో గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరి కాంబోలో ఇంత వ‌ర‌కు రెండు సినిమాలు వ‌చ్చాయి. ఆ రెండూ కూడా పెద్ద హిట్ ను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సినిమా షూటింగ్‌లో ఉంది. కాగ బాల‌య్య త‌న త‌రువాతి సినిమా గోపిచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో రానుంద‌ని తెలుస్తుంది.

డైరెక్ట‌ర్ గోపిచంద్ మాలినేని హిరో బాల‌య్యకు ఒక యాక్ష‌న్ క‌థ‌ను వినిపించాడ‌ట. దానికి బాల‌య్య ఆ కథ‌కు ఓకే కూడా చెప్పాడ‌ని చిత్ర సీమ‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో బాల‌య్య తో భారీ యాక్ష‌న్ సీన్లు తీయించ‌నున్న‌డ‌ట‌. వీరి చిత్రానికి రౌడియిజం అనే టైటిల్ ను ఖ‌రారు చేసార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంట్లో బాల‌య్య బాబును మూడు డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ల్లో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తున్నార‌ని తెలుస్తోంది.టైటిల్ కు త‌గ్గ‌ట్టుగా ఒక పాత్రలో బాల‌య్య బాబును ఫ్యాక్ష‌నిస్టుగా గోపిచంద్ మాలినేని చూప‌బోతున్నాడ‌ని స‌మాచారం. మ‌రో పాత్ర‌లో పోలీస్ గా బాల‌య్య న‌టిస్తున్నాడ‌ని టాలివుడ్ లో గుస‌గుస‌లు వినిస్తున్నాయి.

కాగ హిరో బాల‌య్య ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీనివాస్ తో అఖండ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కూడా బాల‌య్య బాబుతో భారీ యాక్ష‌న్ సీన్ల‌ను బోయ‌పాటి తీస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే విడుద‌ల అయిన బాల‌య్య లుక్ ల‌ను చూస్తే ఈ సినిమాలో యాక్ష‌న్ ఏ విధంగా ఉటుందో అర్థ‌మ‌వుతోంది. వీరి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన సింహ‌, లెజెండ్ సినిమాలు పెద్ద హిట్ కొట్టిన‌వే. ఇప్పుడు ఈ అఖండ సినిమాల కూడా హిట్ కొడుతుంద‌ని బాల‌య్య బాబు అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: