తొడగొట్టి.. మీసం మెలేస్తున్న జూ.ఎన్టీఆర్..!

NAGARJUNA NAKKA
జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనుమడు అనిపించుకుంటున్నారు. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినా.. తన ప్రతిభలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఫ్లాప్ లొచ్చినా.. హిట్ లొచ్చినా.. తొడగొట్టి, మీసం మెలేసి వెనక్కి తగ్గేదే లేదు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడిగా హిందీ చలన చిత్ర సీమలో అడుగుపెట్టి ప్రేక్షకుల మెప్పు పొందారు. బాలరామాయణములో రాముడిగా అలరించారు. 2001లో నిన్ను చూడాలని చిత్రంతో తెలగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు తారక్. ఆ తర్వాత ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో తారక్ కు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. సుబ్బు చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత వి.వి వినాయక్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమాలోని డైలాగులు ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. ఆ తర్వాత వచ్చిన అల్లరి రాముడు అభిమానుల అంచనాలను తలకిందులు చేసింది. ఇక సింహాద్రి చిత్రమైతే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో స్టార్ హీరో స్థానాన్ని కైవసం చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.
జూనియర్ ఎన్టీఆర్ బాగా లావడంతో.. సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు అశోక్ లాంటి చిత్రాలు ఫ్లాప్ ను చవిచూశాయి. రాఖీ చిత్రం పర్వాలేదనిపించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  యమదొంగ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ బాగా సన్నబడ్డారు. కంత్రీ సినిమా తారక్ ను నిరాశపరిచింది. 2010 లో తెరెక్కిన "అదుర్స్" అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక బృందావనం మంచి వసూళ్లను రాబట్టగలిగింది. 2011లో వచ్చిన శక్తి చిత్రం ఘోర పరాజయాన్నిచవిచూసింది.

అదే ఏడాది వచ్చిన "ఊసరవెల్లి" చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. "దమ్ము" చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆ తర్వాత వచ్చిన "బాద్ షా" సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. రామయ్యా వస్తావయ్యా, రభస రభస సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. 2015లో వెండితెరకెక్కిన టెంపర్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కు మంచి బూస్ట్ ను ఇచ్చింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో అద్భుత విజయాన్ని అందుకుంది. జనతా గ్యారేజ్ చిత్రం పర్వాలేదనిపించింది. 2017లో వచ్చిన జై లవకుశ చిత్రం తన నట విశ్వరూపానికి నిలువుటద్దంలా మారింది. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఎస్.ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ఆర్.ఆర్.ఆర్.లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నాడు తారక్. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్..చాలా విచిత్రంగా సాగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: