దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసేవాడే మహేశ్ బాబు..!

NAGARJUNA NAKKA
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినీ లైఫ్ పడిలేచే కెరటంగా సాగుతూ ఉంటుంది. ఒక సినిమా హిట్ అయితే.. రెండు సినిమాలు ఫ్లాప్.. ఆ తర్వాత మళ్లీ హిట్ ఇలా తన కెరీర్ సాగుతూ ఉంటుంది. ఫ్లాప్ అయినంత మాత్రాన నరుత్సాహపడటం.. హిట్ అయినంత మాత్రాన కాలర్ ఎగరేయడం మహేశ్ బాబుకు రాదు. ఎప్పుడూ ఒకేలా ఉంటారు. కామన్ మ్యాన్ లా తన పని తాను చేసుకుంటూ పోతారు. ఆయన సినీ లైఫ్ ఒకసారి పరిశీలిస్తే.. చాలా విచిత్రంగా ఉంటుంది.
మహేశ్ బాబు బాలనటుడిగా తన తండ్రితోనే వెండితెర పంచుకున్నారు. చదువు పూర్తయ్యాక పూర్తిస్థాయిలో సినిమాపై దృష్టి పెట్టారు. రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ ఊపుతోనే నటించిన యువరాజు, వంశీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత విజయాలు అందించలేకపోయాయి. కానీ మహేశ్ బాబు మంచి నటుడిగా గుర్తింపుపొందారు. ఆ తర్వాత 2001లో వచ్చిన మురారీ చిత్రం ఊహించని రీతిలో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక 2002లో వచ్చిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.  
ఇక 2003లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రం.. మహేశ్ బాబు కెరియర్ ను మరో మలుపు తిప్పేలా చేసింది. భూమిక హీరోయిన్ గా... ప్రకాష్ రాజ్ విలన్ గా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించింది. మరోవైపు 2003లో వచ్చిన నిజం చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. కానీ మహేశ్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి. అందుకు గాను మహేశ్ బాబుకు రాష్ట్రప్రభుత్వం నుంచి నంది పురస్కారం వరించింది. 2004లో తెరకెక్కిన నాని చిత్రం పరాజయం చవిచూసింది. అదే సంవత్సరం వచ్చిన అర్జున్ ది కూడా అదే పరిస్థితి.
ఇక పోకిరీ చిత్రం మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన సైనికుడు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.  హై ఎక్స్ ప్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన అతిథి పర్వాలేదనిపించుకుంది.  ఆ తర్వాత మహేశ్ బాబు మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఖలేజా పెద్దగా విజయం సాధించలేదు.   'దూకుడు' సినిమా మహేశ్ సినిమా కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.  'బిజినెస్ మాన్' కు మంచి ఆదరణ లభించింది.  ఇక మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేశ్, మహేశ్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నారు.  ఆ తర్వాత వచ్చిన "1 నేనొక్కడినే" చిత్రంలో ఫ్లాప్ అయింది. ఆగడుకు ఆదరణ కరువైంది. ఇక 2015లో రిలీజైన శ్రీమంతుడు చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.  బ్రహ్మోత్సవం ఫ్లాప్ చవిచూసింది.  2017లో వచ్చిన స్పైడర్ చిత్రానికి నిరాశే ఎదురైంది.  ఇక  2018లో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం అన్ని రకాల ఆడియన్స్ ను థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది. మహేశ్ బాబు 25వ చిత్రంగా 2019లో వచ్చిన మహర్షి చిత్రం ఫ్యాన్స్ లో జోరు పెంచింది.
ఇక పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాపై మహేశ్ బాబు అభిమానుల్లో పెద్ద అంచానాలే ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండటం.. జనవరి 13న సంక్రాంతికి విడుదల కానున్నడంతో ఉత్కంఠ నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: