నాగచైతన్య తీరుపై పెరిగిపోతున్న సందేహాలు !

Seetha Sailaja
ఎట్టకేలకు నాగచైతన్య సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఈ మూవీని సెప్టెంబర్ 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలుసార్లు విడుదల వాయిదా పడ్డ ఈ మూవీ రిలీజ్ విషయంలో ఇది ఫైనల్ అని అంటున్నారు. లేటెస్ట్ గా విడుదల అయిన గోపీచంద్ ‘సిటీ మార్’ కు ప్రేక్షకుల నుండి స్పందన బాగుండటంతో ఇప్పుడు ధైర్యం చేసి ‘లవ్ స్టోరీ’ ని విడుదల చేస్తున్నారు.

వాస్తవానికి ఈమూవీకి ఉన్న క్రేజ్ రీత్యా ఓటీటీ ఆఫర్లు బాగా వచ్చాయి. అయితే శేఖర్ కమ్ముల అదేవిధంగా నాగచైతన్య ఈ మూవీని ధియేటర్లలోనే విడుదల చేస్తాము అని మొండి పట్టుదల పట్టడంతో ఈ మూవీ రిలీజ్ మార్గం సుకమం అయింది అంటున్నారు. ఈ మూవీ ప్రమోషన్ ను ఈ వారం మొదలు పెట్టబోతున్నారు. అయితే ఇక్కడే ఈ విషయమై కొందరికి కొన్ని సందేహాలు వస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా సమంతా నాగచైతన్య ల మధ్య ఏమైంది అంటూ సోషల్ మీడియాలో అనేక గాసిప్పులు హడావిడి చేసాయి. అయితే ఈ గాసిప్పుల పై అటు చైతన్య కానీ ఇటు సమంత కానీ ఎటువంటి ఖండన ఇవ్వకపోవడంతో మరికొందరికి మరిన్ని సందేహాలు వస్తున్నాయి. ఆమధ్య ‘బిగ్ బాస్ సీజన్ 5’ ను నాగార్జున ఎటువంటి మీడియా సమావేశం నిర్వహించకుండానే డైరెక్ట్ గా ఈకార్యక్రమాన్ని మొదలు పెట్టేసారు.

ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్ కోసం నాగచైతన్య మీడియా ముందుకు వస్తే అతడికి మీడియా వర్గాల నుండి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యే ఆస్కారం ఉంది. దీనితో ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రమోషన్ ను నాగచైతన్య ఏదోఒక కారణం చెప్పి తెలివిగా తప్పించుకుంతాడా లేకుంటే ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్ కోసం మీడియా ముందుకు వచ్చినప్పటికీ తనను వ్యక్తిగత ప్రశ్నలు అడగకూడదు అన్న కండిషన్ తో చైతన్య మీడియా ఇంటరవ్యూలకు వస్తాడా అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: