ప్రభాస్ ను హీరోగా నిలబెట్టిన మిర్చి సినిమా.. వరుసగా 9 ఫ్లాప్ లు..!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా కొరటాల శివ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా మిర్చి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 2013 ఫిబ్రవరి 8 న విడుదలైన ఈ చిత్రం లో అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ లు గా నటించగా సత్యరాజ్ ప్రభాస్ తండ్రి గా ముఖ్యమైన భూమిక పోషించాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ప్రతినాయకుడిగా సంపత్ హంసానందిని ప్రత్యేక పాటలో నదియా హీరో తల్లి పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

కొరటాల శివ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం ఆయనపై పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఈ సినిమా ఓ మామూలు ప్రభాస్ సినిమాగానే ప్రేక్షకుల ముందుకు రాగా విడుదలైన తర్వాత కొరటాల శివ పనితనం సినిమా ద్వారా తెలిసింది. ఫ్యాక్షన్ గొడవల కారణంగా తల్లి తండ్రి నుంచి తీసుకెళ్ళి హీరో తో కలిసి సిటీలో జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో తండ్రి గురించి తెలుసుకొని ఆ హీరో ఆ ప్రాంతానికి వెళ్లగా అక్కడ జరిగే గొడవలకు దిగుతాడు.

గొడవలు వద్దు శాంతంగా ఉండాలని కోరుకునే హీరో తండ్రి కొడుకు చేసే పనులను తెలుసుకోలేక పోతాడు. అలా విడిపోయిన అమ్మ నాన్న మళ్ళీ కలిసే సమయానికి ఓ గొడవలో తల్లిని పోగొట్టుకుంటాడు హీరో. అప్పటి నుంచి తండ్రి బాటలో గొడవలు పోవద్దు అని విలన్ ఇంటికి వెళ్లి వారిని మార్చే ప్రయత్నం చేస్తాడు. మరో హీరోయిన్ను ప్రేమిస్తున్నట్లూ ఆ ఇంటికి వెళ్లి  చాలా కష్టపడి వారిని మారుస్తాడు. కత్తి పట్టి పైకి పోవడం కంటే ఒకరికొకరు ప్రేమను పంచుకోవడం ఎంతో మంచిది అనే వాదన నీ ముందుంచుతాడు.  అలా వారిని తన ప్రేమతో మార్చి మనుషులుగా మార్చి గొడవలకు స్వస్తి చెబుతాడు. 

రచయితగా అప్పటికే పెద్ద పెద్ద సినిమాలకు పని చేసిన కొరటాల శివ ఈ సినిమాలో మాటల పరంగా ప్రేక్షకులను ఎంతో ఆలోచింపజేశాడు. ఈ సినిమా ప్రభాస్ కు మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా గా మిగిలింది అని చెప్పవచ్చు. దీనికి ముందు ఆయనకు భారీ ఫ్లాపులు ఉన్నాయి. చత్రపతి సినిమా తర్వాత ఆయన చేసిన పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలు దారుణంగా ఫలితాలను ఇచ్చాయి. డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ యావరేజ్ కాగా నిగితావి భారీ ఫ్లాపులుగా మిగిలాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: