శత్రువులను పిలిపించి మరీ ఫైట్ పెడుతున్నారు.!

NAGARJUNA NAKKA
త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో 11 ఏళ్ల తర్వాత ఒక సినిమా వస్తోంది. 'అతడు, ఖలేజా' తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై మంచి బజ్‌ ఉంది. లాంగ్ గ్యాప్‌ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తున్నారో అని ఆడియన్స్‌ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ అంచనాలకు తగ్గట్లే మహేశ్ సినిమాని భారీగా ప్లాన్ చేస్తున్నారట.
త్రివిక్రమ్, మహేశ్ సినిమాని నార్త్‌లో కూడా భారీగా రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుకే హిందీలో గుర్తింపు ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక ఇప్పుడు విలన్‌ని కూడా బాలీవుడ్‌ నుంచే తీసుకొస్తున్నారట. ఈ మూవీకి సంజయ్‌ దత్‌ని కాంటాక్ట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సంజు 'కెజిఎఫ్2' లో విలన్‌గా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌ కెరీర్‌లో లార్జ్‌ స్కేల్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'హరిహర వీరమల్లు'. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకే పాన్ ఇండియన్ అప్పీల్‌ కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఒక కీ-రోల్‌కి తీసుకున్నారు. విలన్‌గా అర్జున్ రామ్‌పాల్‌ని తీసుకొచ్చారు.
తెలియదు, యాక్టింగ్ రాదు అయినా ముంబయి వాళ్లనే విలన్‌గా తీసుకుంటారు. తెలుగు వాళ్లు పనికిరారా అని సీనియర్ ఆర్టిస్టులు చాలామంది విమర్శిస్తుంటారు. కొన్నేళ్ల నుంచి ఈ విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విమర్శల్లాగే హైదరాబాద్‌లో లాండ్ అవుతోన్న ముంబయి విలన్లు కూడా పెరుగుతూనే ఉన్నారు. ప్రభాస్ 'బాహుబలి' తర్వాత పాన్ ఇండియన్ మూవీస్‌కే సైన్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో లార్జ్‌ స్కేల్‌ మూవీస్‌లో నటిస్తున్నాడు. అలాగే నార్త్‌ మార్కెట్‌ కోసం బాలీవుడ్‌ నుంచి సపోర్టింగ్ ఆర్టిస్టులని, విలన్స్‌ని తీసుకుంటున్నాడు. ఈ లెక్కలతోనే 'సాహో' సినిమాలో విలన్‌గా నీల్‌ నితిన్‌ ముకేష్‌ని తీసుకున్నారు.
రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఊరమాస్ సినిమా 'వినయ విధేయ రామ'. 'రంగస్థలం' తర్వాత చరణ్ చేస్తోన్న ఈ మూవీపై మెగాఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ హైప్స్‌ని మ్యాచ్ చెయ్యడానికి భారీ స్టార్‌ క్యాస్టింగ్‌తో భారీగా సినిమా తీశాడు బోయపాటి. ఇక విలన్‌గా బాలీవుడ్ నుంచి వివేక్ ఒబెరాయ్‌ని దింపాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: