పవన్, మహేష్ లు ఇద్దరికీ కామన్ గా ఉన్న అలవాటు అదే ... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో తమ సినిమాల విజయాలతో క్రేజ్ ని మరింతగా పెంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఈ ఇద్దరికీ దాదాపుగా ఒకే విధమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే సినిమా మార్కెట్ అన్ని ఏరియాల్లోను ఉంది. వీరి నుండి యావరేజ్ సినిమాలు వచ్చినా చాలు అది సూపర్ హిట్ అయ్యేంత క్రౌడ్ పుల్లింగ్ క్యాపబిలిటీ ఈ ఇద్దరు స్టార్స్ కి ఉంది. ఇక వీరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు వారి వారి అభిమానులు థియేటర్స్ వద్ద చేసే సందడి అంతా ఇంతా కాదు.
ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవి తరువాత నెంబర్ వన్ స్థానానికి ప్రస్తుతం ఎంతో దగ్గరగా ఉన్న ఈ ఇద్దరి గురించి తెలుసుకోవాలని వారి అభిమానులు సైతం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. తొలిసినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండి మొన్నటి వకీల్ సాబ్ వరకు పవన్ కెరీర్ లో ఎన్నో భారీ విజయాలు అందుకున్నప్పటికీ పవన్ యాటిట్యూడ్ లో కొంచెం కూడా మార్పు రాలేదని, అలానే ఎంతో ఒదిగి ఉంటారని చెప్తుంటారు ఆయన సన్నిహితలు.
ఇక తండ్రి వారసుడిగా రాజకుమారుడు మూవీ తో హీరోగా లాంఛ్ అయిన సూపర్ స్టార్ మహేష్ కూడా మొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలతో స్టార్ స్టేటస్ సంపాదించినప్పటికీ అందరితో కలిసి మెలిసి ఉండడంతో పాటు ఎంతో సదా సీదాగా వ్యవహరిస్తూ ఉంటారని పలువురు సినిమా ప్రముఖులు చెప్తుంటారు. అయితే ఈ ఇద్దరు స్టార్ నటుల మధ్య ఒక విషయమై ఒకింత సారూప్యత ఉందని అంటున్నారు. ఈ ఇద్దరూ కూడా తమకు తీరిక సమయం దొరికితే ఎక్కువగా పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారని, అలానే ఇద్దరికీ కూడా పార్టీ కల్చర్ అస్సలు నచ్చదని సమాచారం. మరి అంత పెద్ద స్టార్స్ ఊరికే అయిపోరుగా, ఇంత మంచి అలవాట్లు ఉండబట్టే వారిద్దరికీ అంత గొప్ప పేరు వచ్చిందని అంటున్నారు పలువురు ఆడియన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: