మహేష్ "దూకుడు" మూవీ వెనుకున్న కథిదే?

VAMSI
టాలీవుడ్ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేశ్ బాబు, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం దూకుడు. 2011 లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ అందుకుని రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం మహేష్ బాబు కెరియర్ లో ఒక ఆణిముత్యంగా గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆచంట గోపీచంద్, ఆచంట రాం, సుంకర అనిల్ కలసి సంయుక్తంగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరింత ప్లస్ గా నిలిచింది. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ సినిమా గురించి ప్రేక్షకులకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఓ సారి తెలుసుకుందాం.
శ్రీను వైట్ల మహేష్ తో సినిమా చెయ్యాలని అనుకున్నాడట. దాని కోసం శ్రీను వైట్ల మహేష్ అక్క మంజుల కలిసి విషయాన్ని చెప్పాడట. దానికి ఆమె సరేనని ఇద్దరూ కలిసేందుకు మీటింగ్ ఏర్పాటు చేసిందట. అలా ఆ మీటింగ్ లో మొదటిసారి మహేష్ ను కలిసిన డైరెక్టర్ శ్రీను వైట్ల చెప్పిన మొదటి మాట మీతో బ్లాక్ బాస్టర్ తీస్తానండి అని అన్నారట. అందుకు మహేష్ అయితే ఆ పనిలో ఉండండి అని గ్రీన్ సిగ్నల్ ఇచారట. అలా ఆ మీటింగ్ అయ్యాక ప్రిన్స్ అక్క  మంజులకు పలుమార్లు థాంక్స్ చెప్పారట శ్రీను వైట్ల. ఇక కథను రెఢీ చేయడం కోసం కసరత్తులు మొదలు పెట్టాడు. రచయిత జె కె భారవి, శ్రీనువైట్ల కలిసి కథను ఫిక్స్ అవ్వడానికి కూర్చున్నారు. ఆ తర్వాత  మైతలాజికల్, హిస్టారికల్ థీమ్స్ ఇలా వీటిలో ఏదైతే మహేష్ కి సూట్ అవుతుంది.
అలాగే లైన్ సరికొత్తగా ఉండాలి అని గంట అనుకున్న మీటింగ్ కాస్తా ఐదు గంటలు అయినా డిస్కషన్ జరుగుతూనే ఉంది. తనకనిపించిన ప్రతి చిన్న లైన్ గురించి మహేష్ ని కలిసి చెప్తూ ఉన్నారట శ్రీనువైట్ల. అయితే మహేష్ మాత్రం శ్రీను గారు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను మీకు నచ్చింది చెయ్యండి అని చెప్పారట. చివరకి  గోపి మోహన్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చడంతో అలా దూకుడు మూవీ కథ మొదలయ్యింది. ఆ  టైమ్ లో డిస్టిబ్యూటర్స్, అభిమానులు అందరూ మహేష్ నుండి హిలేరియస్ మూవీని కోరుకుంటున్న సమయంలో మళ్ళీ మొదట అనుకున్న కథను కాన్సిల్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు శ్రీనువైట్ల. ఆ తరవాత కథని డెవలప్ చేశారు శ్రీను వైట్ల. ఖైరతాబాద్ మాజీ ఏమ్మెళ్యే జనార్థన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని కథను డెవలప్ చేశారు. కథ పూర్తి కాకముందే హీరోయిన్ గా సమంతను ఒకే చేశారు.
ఇక మహేష్ బాబు ఫాదర్ క్యారెక్టర్ కోసం ఎవరైతే బాగుంటుంది అని అనుకుంటుండగా ప్రకాష్ రాజ్ ని ఫైనల్ చేయండి అని సజెస్ట్ చేశారట ప్రిన్స్.  మొదట ఈ సినిమాకి పవర్ అని టైటిల్ అనుకున్నారట, కానీ ఆల్రెడీ వేరే వాళ్ళు  బుక్  చేసుకోవడంతో ఆ తర్వాత ఆలోచించి దూకుడు అని ఫైనల్ చేశారు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట దేవి శ్రీ ప్రసాద్ ను అనుకోగా ఆ టైమ్ లో దేవి ఫుల్ బిజీగా ఉండటంతో శ్రీను వైట్లను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అడుగుతున్న  థమన్ కు ఛాన్స్ లభించిందట. ఇలా ఈ సినిమాలో చాలా మార్పులు జరిగి చివరికి ఇండస్ట్రీ లో ఎన్నో రికార్డులు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: